ప్రజలకు అరచేతిలో వైకుంఠం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలకు అరచేతిలో వైకుంఠం

ప్రజలకు అరచేతిలో వైకుంఠం

Written By news on Tuesday, June 24, 2014 | 6/24/2014

'ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: అసత్య హామీలతో చంద్రబాబు నాయుడు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారని, ఇప్పుడు ఆ హామీలను దాటవేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రోజా, విశ్వేశ్వర్ రెడ్డి, ఐజయ్య విమర్శించారు. పంటల రుణమాఫీ, 9 గంటల ఉచిత విద్యుత్ హమీల అమలుపై ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ ప్రకటించలేదన్నారు.

కేంద్రం, ఆర్ బీఐపై నెపం మోపుతూ రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలుపై కార్యాచరణ ప్రకటించకుండా కోటయ్య కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయనని, రుణమాఫీ అమలుపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: