తండ్రీ కొడుకులు ప్రతిపక్ష నేతలుగా వ్యవహరించిన సంఘటనలు చాలా అరుదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తండ్రీ కొడుకులు ప్రతిపక్ష నేతలుగా వ్యవహరించిన సంఘటనలు చాలా అరుదు

తండ్రీ కొడుకులు ప్రతిపక్ష నేతలుగా వ్యవహరించిన సంఘటనలు చాలా అరుదు

Written By news on Saturday, June 21, 2014 | 6/21/2014

ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్
ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్
అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించిన ఏపీ స్పీకర్ కోడెల
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం శాసనసభలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధికారికంగా ప్రకటించారు. సభలో వైఎస్సార్ సీపీకి 67 మంది సభ్యుల బలముంది. ఇప్పటికే వారు శాసనసభాపక్ష నేతగా జగన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.
 
 ప్రతిపక్ష నేతలుగా తండ్రీ కొడుకులు: తండ్రీ కొడుకులు ప్రతిపక్ష నేతలుగా వ్యవహరించిన సంఘటనలు చాలా అరుదు. కానీ ఈ అరుదైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆవిష్కృతమైంది. 30 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, ప్రజానేతగా నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి 1999-2004 మధ్య కాలంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. సరిగ్గా పదేళ్ల తర్వాత ఇదే శాసనసభలో ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాడతామని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఇప్పటికే జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
Share this article :

0 comments: