తంగిరాల పేరుంది.. శోభా నాగిరెడ్డి పేరు లేకపోవడమేంటి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తంగిరాల పేరుంది.. శోభా నాగిరెడ్డి పేరు లేకపోవడమేంటి?

తంగిరాల పేరుంది.. శోభా నాగిరెడ్డి పేరు లేకపోవడమేంటి?

Written By news on Wednesday, June 18, 2014 | 6/18/2014

తంగిరాల పేరుంది.. శోభా నాగిరెడ్డి పేరు లేకపోవడమేంటి?
హైదరాబాద్: దివంగత ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపే విషయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. సంతాప తీర్మానంలో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ పేరును మాత్రమే చేర్చి శోభా నాగిరెడ్డి పేరును విస్మరించడం తగదని అన్నారు. ఈ అంశాన్ని శాసన సభ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. చనిపోయిన శాసన సభ్యులకు సంతాప తెలపడం మానవత్వమని, చంద్రబాబు ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరించడం సరికాదని వైసీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు మాట్లాడారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ అధ్యక్షత బుధవారం జరిగిన ఆ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. గురువారం ఆరంభయ్యే ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాల్లో వైఎస్ఆర్ సీపీ అనుసరించబోయే వ్యూహం గురించి చర్చించారు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ ఇటీవల గుండెపోటుతో మరణించగా, ఎన్నికలకు ముందు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మరణానంతరం శోభానాగి రెడ్డి ఆళ్ళగడ్డ నుంచి గెలుపొందారు.
Share this article :

0 comments: