వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి

వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయుల దాడి

Written By news on Monday, June 16, 2014 | 6/16/2014

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వర్గీయుల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. ఈ రోజు కొంత మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడి చేసిన ఘటన జిల్లాలోని కనగాపల్లి మండలం బద్దాలపురంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.  వైఎస్సార్ సీపీకి అండగా ఉండటం సహించలేని కొంతమంది టీడీపీ వర్గీయులు పాశవికంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.  దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.
Share this article :

0 comments: