బిజీ బిజీగా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిజీ బిజీగా...

బిజీ బిజీగా...

Written By news on Friday, June 27, 2014 | 6/27/2014

బిజీ బిజీగా...
 సాక్షి పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం బిజీబిజీగా గడిపారు. శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌కు ఎర్రగుంట్లలో ఘనస్వాగతం లభించింది. జిల్లా పర్యటనలో భాగంగా బద్వేలు, కడపలో పలువురు బొకేలు అందించి అభినందనలు తెలిపారు.
 
 రుణమాఫీ అంశంతో పాటు వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ అసెంబ్లీ తొలిసమావేశాల్లో ప్రసంగించిన తీరు ఎంతో బాగుందని కార్యకర్తలు తమ సంతోషాన్ని జగన్ తో పంచుకున్నారు. ఐదేళ్లు కాదు.. ఎన్నాళ్లయినా మీ వెంటే ఉంటామంటూ చెప్పుకొచ్చారు. ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురైనా తాను వెంటనే స్పందిస్తానని.. ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
 
 పల్లెపల్లెలో  హారతి పట్టిన మహిళలు :
 పులివెందులనుంచి బద్వేలుకు ఉదయం 9.30గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ బయలుదేరగా.. చాలాచోట్ల  మహిళలు, అభిమానులు ఆపి హారతి పట్టారు.  అట్లూరు మండలం వెంకటాపురం వద్ద గ్రామస్తులంతా రోడ్డుపైకి వచ్చారు. రామాంజనమ్మ అనే మహిళ వైఎస్ జగన్‌ను చూడగానే కన్నీరు పెట్టుకుంది. జగన్ ఆమెను ఓదార్చుతూ  ఏడవద్దు.. నేనున్నాను.. మీకష్టమేమిటో చెప్పండంటూ అడిగి తెలుసుకోవడంతో పాటు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. రాజుపాలెం గ్రామం వద్ద కూడా పలువురు మహిళలు జగన్ కాన్వాయ్‌ను ఆపి మాట్లాడారు.
 
 ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి.. :
 శాసనసభలో ప్రతిపక్షనేతగా ఎన్నికైన అనంతరం తొలిసారి జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ కు అడుగడుగునా ప్రజలు, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొందరు పూలమాలలు వేస్తూ.. మరికొందరు పుష్ప గుచ్చాలను అందిస్తూ స్వాగతం పలికారు. గురువారం ఉదయాన్నే ముద్దనూరులో రైలు దిగగానే కార్యకర్తలు బాణా సంచా పేల్చారు. పులివెందులలోని ఇంటికి వద్దకు రాగానే పలువురు మహిళా కార్యకర్తలు దిష్టి తీసి హారతి పట్టారు. ప్రతిపక్షనేత హోదాలో తొలిసారి పర్యటిస్తున్న వైఎస్ జగన్‌ను చూసేందుకు.. కరచాలనం చేసేందుకు జనాలు ఆరాటపడ్డారు.

 వైఎస్ జగన్ వెంట పర్యటించిన ఎంపీ వైఎస్ అవినాష్ :
 శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా పలు కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు. బద్వేలులో నూతన జంట ఆశీర్వాదంతోపాటు కార్యకర్తలు, నాయకులతో చర్చించే సమయంలో కూడా వైఎస్ జగన్ వెంటే అవినాష్‌రెడ్డి నడిచారు. అనంతరం కడపలో కూడా కార్యకర్తలు, నాయకుల సమస్యలను వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ అవినాష్‌రెడ్డి ఆలకిస్తూ వచ్చారు.
 
 వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు :
 శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డిని గురువారం పలువురు ఎమ్మెల్యేలు కలిశారు. బద్వేలులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి డీసీ గోవిందరెడ్డితోపాటు ఎమ్మెల్యే జయరాములు కలిసి చర్చించారు.
 
 అనంతరం వైఎస్ జగన్ నేరుగా కడపకు రాగా అక్కడ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ అభ్యర్థి సురేష్‌బాబు, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, కడప, మైదుకూరు ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రఘురామిరెడ్డి, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తదితరులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయాలకు సంబంధించిన అంశాలతోపాటు జిల్లాలో పార్టీ పరిస్థితులపై  వారు మాట్లాడుకున్నారు.
 బద్వేలు, కడప కార్యాలయంలో
కార్యకర్తలతో.. :
శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం 12గంటల ప్రాంతలో బద్వేలులోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లతో చర్చించారు. కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంటన్నరపాటు పార్టీ కార్యకర్తలతో గడిపిన జగన్ అనంతరం నూతన జంట మానస వీణ, సుబోధ్‌రెడ్డి పెళ్లి రిసెప్షన్‌కు హాజరై నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు.
 
 ఈ సందర్భంగా అక్కడే వేముల మండల కన్వీనర్ నాగేళ్ల సత్యప్రభావతమ్మ, నాగేళ్ల సాంబశివారెడ్డి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో కూడా వైఎస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం నేరుగా కడపకు చేరుకుని వైఎస్‌ఆర్ సీపీ కార్యాలయంలో కార్యకర్తలతో మమేకమయ్యారు. సాయంత్రం 4గంటలనుంచి రాత్రి వరకు కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. అంతకుమునుపు దాదాపు గంటపాటు కడప కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు.
 
 నేడు పులివెందుల కార్యాలయంలో వైఎస్ జగన్ :
 శాసనసభ పక్ష నేత. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌రెడ్డి శుక్రవారం ఉదయం నుంచి పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. ప్రజలు, కార్యకర్తలు, నేతలు, అభిమానులు వైఎస్ జగన్‌ను కలవవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.
 
 అన్నా.. అంటూ ఆప్యాయ పలకరింపు
 కడప రూరల్ : ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తొలిసారిగా కడపకు వచ్చారు. స్థానిక వైఎస్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి కలిశారు. ఈ సందర్బంగా తమ సమస్యలను వివరించారు. వినతిపత్రాలను సమర్పించారు.
 
 తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులను వైఎస్ జగన్ పేరుపేరునా ఆప్యాయంగా పలుకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల కడప కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ పరిచయ కార్యక్రమంలో వైఎస్ జగన్ కార్పొరేటర్లను అన్నా అంటూ... ఆప్యాయంగా పేరుపేరునా పలుకరించారు. కుటుంబ సభ్యుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఓటమి చెందిన ఒకరిద్దరు కార్పొరేటర్లను పలుకరించి ఏం ఫర్వాలేదంటూ భరోసా ఇచ్చారు. భవిష్యత్తు మనదేనని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నడవాలని సూచించారు
Share this article :

0 comments: