పెంచిన ఛార్జీలు తగ్గించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెంచిన ఛార్జీలు తగ్గించాలి

పెంచిన ఛార్జీలు తగ్గించాలి

Written By news on Friday, June 20, 2014 | 6/20/2014

పెంచిన ఛార్జీలు తగ్గించాలి: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : రైల్వే ఛార్జీల పెంపును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో, అసలు ఎలాంటి చర్చ లేకుండానే ఏకపక్షంగా రైల్వే ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.

ప్రయాణికులపై భారీ మొత్తంలో భారం మోపారని, అలాగే సరుకు రవాణా ఛార్జీలు కూడా పెంచి రైతులు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు. పెంచిన ఛార్జీలను తక్షణం ఉపసంహరించాలని ఉమ్మారెడ్డి  వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: