‘వడ్డేపల్లి’ మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘వడ్డేపల్లి’ మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

‘వడ్డేపల్లి’ మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

Written By news on Tuesday, June 3, 2014 | 6/03/2014

‘వడ్డేపల్లి’ మృతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
కుటుంబీకులకు జగన్ పరామర్శ
 
హైదరాబాద్  కూకట్‌పల్లి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దివంగత వడ్డేపల్లి నర్సింగరావు మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టమని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం వడ్డేపల్లి ద్వాదశ దినకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్‌మోహన్‌రెడ్డి మనోధైర్యంతో ఉండాలని సూచించారు. కుటుంబ సభ్యులతో కొద్దిసేపు మాట్లాడిన ఆయన.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతోనూ ముచ్చటించారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, జస్టిస్ సుభాషణ్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు వైఎస్ కొండారెడ్డి, ఉండి ఎమ్మెల్యే శివరామరాజు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, మునిసిపల్ మాజీ చైర్మన్ హనుమంతరావు, లోకయ్యపటేల్, మాధవరం కాంతారావు, వైఎస్సార్ సీపీ నాయకుడు ముక్కా రూపానందరెడ్డి, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు సురేష్‌రె డ్డి, ఎమ్‌ఎస్‌ఆర్, శివారెడ్డి, జార్జి, ప్రభారెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు వడ్డేపల్లి చిత్రపటానికి నివాళులు అర్పించారు.
Share this article :

0 comments: