ప్రతిపక్షంగా ప్రజావాణి వినిపిస్తాం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతిపక్షంగా ప్రజావాణి వినిపిస్తాం: వైఎస్ జగన్

ప్రతిపక్షంగా ప్రజావాణి వినిపిస్తాం: వైఎస్ జగన్

Written By news on Friday, June 20, 2014 | 6/20/2014

వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : ప్రతిపక్షంగా తాము ప్రజావాణిని వినిపిస్తామని శాసనసభలో ప్రధాన విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. స్పీకర్ గా కోడెల శివప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయన శుక్రవారం సభలో మాట్లాడుతూ సభలో ఉన్నవి రెండు పార్టీలు మాత్రమేనని, స్పీకర్ అధికార పార్టీ సభ్యుడిగా కాకుండా ప్రతిపక్షానికి కూడా మద్దతుగా ఉండాలన్నారు.

ప్రతిపక్షానికి స్పీకర్ సభలో తగిన అవకాశం ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యం అనే బండికి స్పీకర్ ఇరుసు లాంటివారు అని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికార పక్షం, ప్రతిపక్షం అనే బేధం లేకుండా సమదృష్టితో వ్యవహరించాలని ఆయన...స్పీకర్ ను కోరారు. భావి తరాలకు స్పీకర్ ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలపై జగన్ మాట్లాడుతూ భవిష్యత్ లో ఎవరు అధికారంలో ఉండాలో దేవుడే తేలుస్తాడని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Share this article :

0 comments: