ఎస్ ఐ దాడి, వైఎస్ఆర్ సీపీ నేత గుండెపోటుతో మృతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎస్ ఐ దాడి, వైఎస్ఆర్ సీపీ నేత గుండెపోటుతో మృతి

ఎస్ ఐ దాడి, వైఎస్ఆర్ సీపీ నేత గుండెపోటుతో మృతి

Written By news on Tuesday, July 1, 2014 | 7/01/2014

వీడియోకి క్లిక్ చేయండి
స్టేషన్ లో దాడిచేసిన ఎస్ఐ శ్రీనివాసరావు..
* గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందిన వైజా విజయభాస్కర్ రెడ్డి

గిద్దలూరు: ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ నేత, గిద్దలూరు సహకార సంఘ అధ్యక్షుడు వైజా భాస్కర్‌రెడ్డి(48) లాకప్ డెత్ అయ్యారు. ఓ వివాదం విషయమై పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఆయనపై స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావు దాడి చేయడంతో ఆయన గుండెపోటుతో అక్కడికక్కడే మరణించినట్లు వైెస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి 12.25 గంటల సమయంలో జరిగింది.
డీఆర్‌ఆర్ ప్లాజాలో నివాసముంటున్న డాక్టర్ హరనాథరెడ్డికి, అక్కడే నివాసముంటున్న హీరో హోండా షోరూం నిర్వాహకుడు తోట సుబ్బారావుకు మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో ఎస్సై వై.శ్రీనివాసరావు.. హరనాథరెడ్డి భార్య పట్ల దురుసుగా ప్రవర్తించారు. స్టేషన్‌కు చేరుకున్న భాస్కర్‌రెడ్డి ఎస్సై ప్రవర్తనను ఖండించారు. భాస్కర్‌రెడ్డిపై ఎస్సై చేయి చేసుకోవడంతో ఆయన కిందపడిపోయాడు.
భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తరలించే లోపే గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి అర్ధరాత్రి నుంచి పోలీస్‌స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి మృతితో పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
Share this article :

0 comments: