సాయంత్రం కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాయంత్రం కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ

సాయంత్రం కేంద్ర హోంమంత్రితో వైఎస్ జగన్ భేటీ

Written By news on Thursday, July 10, 2014 | 7/10/2014

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయనతో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు కూడా హస్తిన వెళ్లారు. వైఎస్ జగన్ గురువారం సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు.

 అలాగే శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో జగన్ భేటీ కానున్నారు. వీరితో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా వైఎస్ జగన్ సమావేశం అవుతారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ చైర్మన్ల, మండలపరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ నేతలు చేసిన అరాచకాలు, ప్రభుత్వ అధికార దుర్వినియోగం వంటి అంశాలను ఆయన వీరి దృష్టికి తేనున్నారు. చంద్రబాబు నాయుడు సర్కారు ఏర్పడిన నెలరోజుల్లోనే 17 మంది వైఎస్ఆర్  కాంగ్రెస్ కార్యకర్తలను హతమార్చడం, 110 మందిని తీవ్రంగా గాయపర్చిన ఉదంతాలను వివరించనున్నారు.
Share this article :

0 comments: