కళ్లల్లో కారం చల్లి..వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కళ్లల్లో కారం చల్లి..వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి

కళ్లల్లో కారం చల్లి..వైఎస్ అవినాష్ రెడ్డిపై దాడి

Written By news on Friday, July 4, 2014 | 7/04/2014

కడప: వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు రణరంగంగా మారింది. మున్సిపల్‌ ఛైర్మన్ ఎన్నికలను పరిశీలించేందుకు వెళ్లిన కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ నాయకులు దాడికి దిగారు. టీడీపీ కౌన్సిలర్లు అవినాష్ రెడ్డి కళ్లల్లో కారం చల్లారు. అవినాష్ రెడ్డికి గాయాలవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అడ్డుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. అయితే ఎన్నికల సంఘం ఆదేశంతో  సాయంత్రం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అంతకుముందు  పోలీసులపైనా టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఎస్ఐ సహా ఐదుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి భాష్పాయువు ప్రయోగించారు.
Share this article :

0 comments: