ప్రజా పోరాటానికి అండగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజా పోరాటానికి అండగా

ప్రజా పోరాటానికి అండగా

Written By news on Wednesday, July 16, 2014 | 7/16/2014

ఇంటి తలుపు తట్టి.. గుండె బరువును దించి..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చెన్నైలో భవనం కూలిన ప్రమాదంలో మృతి చెందిన జిల్లా వాసుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి మంగళవారం పరామర్శించారు. చిరుజల్లులతో చిత్తడి వాతావరణం ఉన్నప్పటికీ ప్రతి ఇంటికీ వెళ్లి వారిని పేరు పేరునా ఓదార్చారు. చెన్నై ఘటనలో మృతి చెందిన దత్తిరాజేరు మండలం కోరపు కృష్ణాపురం, బాడంగి గ్రామాల్లో గల  తొమ్మిది మంది ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.  
యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తరువాత మీకు సమాచారం ఎప్పుడందిందీ? ఎలా జరిగిందన్న వివరాలను అడిగారు. రాష్ర్ట శాసనసభలో ప్రతిపక్షనాయకుడు  తమ ఇంటిలోకి వచ్చి కష్టాల్లో పాలుపంచుకోవడంతో వారంతా కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. జగనన్న అభిమానానికి చలించిపోయి, విలపించేశారు. ‘మాకు కలిగిన కష్టం మీ రాకతో, మీ పరామర్శతో కరుగుతోంది’ అని బాధితులు అన్నారు.

 వారిని జగన్‌మోహనరెడ్డి అనునయించారు. మీకు నేనున్నానంటూ ఓదార్చారు. మీకు కష్టం కలిగితే మాకు కలిగినట్టేనని, అండగా నిలుస్తాననీ మాటిచ్చారు. కోరపు కృష్ణాపురంలోని ఏడు కుటుంబాలను పరామర్శించారు. కృష్ణాపురంలో తొలుత పతివాడ బంగారునాయుడు, తరువాత కర్రి తవుడమ్మ, సిరిపురపు రాము, పేకేటి అప్పలరాం, లక్ష్మీ ( అప్పలరాం, లక్ష్మీ  భార్యాభర్తలు) కుటుంబీకులను పరామర్శించారు.
 
అనంతరం వనం దుర్గ, పతివాడ గౌరీశ్వరి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే శిథిలాల కింద చిక్కుకుని మూడు రోజుల తరువాత సజీవంగా బయటికొచ్చిన మంత్రి మీనమ్మను కూడా పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. బాడంగిలో రెండు కుటుంబాలను పరామర్శించారు. తొలుత బొమ్మి గౌరినాయుడు, తర్వాత బొంగు శాంతకుమారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

 జగనన్న వస్తుంటే స్థానిక ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పరామర్శ గ్రామాలతో పాటు ఆ గ్రామాల మధ్య ఉన్నవారు కూడా జగనన్నను చూసి చేతులూపుతూ కనిపించారు. కష్టాలున్నచోటకి నువ్వొస్తావన్నా బిగ్గరగా అనడం వినిపించింది. రోడ్డు పొడవునా  ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తూ అభివాదం చేసుకుంటూ జగన్ ముందుకు  కదిలిపోయారు. తమ గ్రామానికి చెందిన వారు మృతి చెందితే వచ్చారనీ ఆయా గ్రామాల ప్రజలు, మా పక్క ఊరిలో కష్టం వస్తే జగనన్న పరామర్శకు వచ్చారని పక్క గ్రామాల ప్రజలు ఆయనకు చేతులెత్తి నమస్కరించారు. ప్రతి ఇంటిలో ఉన్నవారిని పేరుపేరునా పలకరించి’ మీకు ఇలాంటి కష్టం రాకుండా ఉండాల్సిందమ్మా!’ అని అనునయిస్తుంటే చూస్తున్న వారి కళ్లు కూడా చెమర్చాయి. జిల్లాలో ఉన్నవారంతా జగనన్న వస్తున్నాడని తెలిసి ఆయా గ్రామాల మధ్య ఉన్న రహదారుల్లో   వర్షంలో వేచి చూశారు.

 బాధితుల పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, జిల్లా పార్టీ అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్లమెంట్ ఇన్‌చార్జి బేబీనాయన, నియోజకవర్గ ఇన్‌చార్జిలు కోలగట్ల వీరభద్రస్వామి, కడుబండి శ్రీనివాసరావు, జమ్మాన ప్రసన్నకుమార్, బెల్లాన చంద్రశేఖర్, నెక్కల నాయుడుబాబు, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, పార్టీ నేతలు కోళ్ల గంగాభవానీ, వేచలపు చినరామునాయుడు, అంబళ్ల శ్రీరాములనాయుడు,యల్లపు దమయంతి, మజ్జి వెంకటేష్, బొబ్బిలి ఎంపీపీ గోర్జ వెంకటమ్మ, జెడ్పీటీసీలు బోయిన లూర్ధమ్మ, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.

 ప్రజా పోరాటానికి అండగా ఉండండి
 బొబ్బిలి: రానున్న రోజుల్లో జరిగే ప్రజా పోరాటానికి మీరంతా అండగా ఉండాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి  పార్టీ శ్రేణులకు సూచించారు. మంగళవారం బొబ్బిలి కోటలోని దర్బార్ మహాల్‌కు వచ్చిన అశేష అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పిక్‌పాకెటింగ్ చేసిన వారిపై పిక్‌పాకెటర్‌గా కేసు పెడతారని, చిట్‌ఫండ్ మోసం చేసిన వారిపై చీటింగ్ కేసు పెడతారని, ప్రజల్ని మోసగించి.. ముఖ్యమంత్రి అయి.. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని వారిపై 420 కేసు పెడ్తారా? 840 కేసు పెడ్తారా? అని ప్రజలు అడుగుతున్నారని చెప్పారు.

 సీమాంధ్ర ప్రజలను చంద్రబాబు పూర్తిగా మోసం చేశారని, రానున్న రోజుల్లో జరిగే ప్రజా పోరాటంలో మీరంతా తోడుగా నిలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు, పార్లమెంట్ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన), పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్సీ కోలగట్ల, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి, జెడ్పీ మాజీ ైచైర్మన్ బెల్లాన చంద్రశేఖర్, జమ్మాన ప్రసన్నకు  మార్, కడుబండి శ్రీనివాసరావు, పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు తూముల రాంసుధీర్, తదితరులు  పాల్గొన్నారు.
Share this article :

0 comments: