
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నాలుగు రోజుల పర్యటన కోసం మంగళవారం విశాఖ రానున్నారు. చెన్నైలో నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం, భారీ ప్రహరీ కూలిన దుర్ఘటనల్లో మరణించిన విజయనగరం జిల్లాకు చెందిన 24 మంది బాధిత కుటుంబాలను, శ్రీకాకుళం జిల్లాకు చెందిన 23 మంది బాధిత కుటుంబాల్ని పరామర్శించనున్నారు. మంగళ, బుధవారాలు విజయనగరం జిల్లాలోను, గురు, శుక్రవారాలు శ్రీకాకుళం జిల్లాలోను ఆయన పర్యటించనున్నారు.
0 comments:
Post a Comment