ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయండి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయండి'

ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయండి'

Written By news on Sunday, July 13, 2014 | 7/13/2014

'ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయండి'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: మార్కాపురం జడ్పీటీసీ జవ్వాది రంగారెడ్డి అక్రమ అరెస్ట్ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ నవీన్‌మిట్టల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక అధికారాలు ఉపయోగించి జవ్వాది రంగారెడ్డిని జడ్పీ ఎన్నికల్లో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఆయనను హాజరుపర్చే వరకు ప్రకాశం జడ్పీ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు.

ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో నలుగురు వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలను టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని కూడా నవీన్‌మిట్టల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. నవీన్‌మిట్టల్‌ ను కలిసిన వారిలో ఎంవీ మైసూరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పీఎన్వీ ప్రసాద్ ఉన్నారు.    
Share this article :

0 comments: