Home »
» రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబుకు ముందే తెలుసు
రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబుకు ముందే తెలుసు
హైదరాబాద్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయలేని బాబు ఇప్పుడు కల్లబొల్లి కారణాలు చెబుతున్నారన్నారు. విశ్వసనీయతకు, వంచనకు జరుగుతున్న ఎన్నికలని తాము ముందే చెప్పామన్నారు.రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చంద్రబాబుకు ముందే తెలుసునని, అన్నీ తెలిసి విభజనకు ఆయన అనుకూలంగా ఓటేశారని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోల్లో రైతు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
0 comments:
Post a Comment