రాష్ట్రానికి కొత్త చరిత్ర కావాలి... రక్తచరిత్ర కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రానికి కొత్త చరిత్ర కావాలి... రక్తచరిత్ర కాదు

రాష్ట్రానికి కొత్త చరిత్ర కావాలి... రక్తచరిత్ర కాదు

Written By news on Tuesday, July 1, 2014 | 7/01/2014

'రాష్ట్రానికి కొత్త చరిత్ర కావాలి... రక్తచరిత్ర కాదు'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటూ సోమాలియాగా మారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ లో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... ప్రకాశం జిల్లా గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భాస్కరరెడ్డి మరణం పోలీసులతో టీడీపీ నేతలు చేయించిన రాజకీయ హత్య అని ఆమె అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రానికి కొత్త చరిత్ర కావాలి కానీ... రక్త చరిత్ర కాదని చంద్ర బాబు కు ఈ సందర్బంగా పద్మ హితవు పలికారు. రాష్ట్రంలో టీడీపీ హత్య రాజకీయాలను తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రస్తావించారని పద్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. హత్యా రాజకీయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు.
Share this article :

0 comments: