ఏపీ ఎన్జీవోల భూములు తిరిగి ఇవ్వండి: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏపీ ఎన్జీవోల భూములు తిరిగి ఇవ్వండి: వైఎస్ జగన్

ఏపీ ఎన్జీవోల భూములు తిరిగి ఇవ్వండి: వైఎస్ జగన్

Written By news on Friday, July 4, 2014 | 7/04/2014

 ఏపీ ఎన్జీవోలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారు.  ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన 189 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆ భూములను ఏపీ ఎన్జీవోలకు అప్పగించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

ఏపీ ఎన్జీవో ఉద్యోగులు ఆ భూములను ప్లాట్లుగా విభజించుకుని, విద్యుత్, రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం కోట్లు ఖర్చు పెట్టారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరికైనా భూకేటాయింపులు చేయదలచుకుంటే ప్రత్యామ్నయం చూడాలే కానీ, ఆ భూములను స్వాధీనం చేసుకోవటం తగదన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఏపీ ఎన్జీవోలకు అండగా ఉండాలని జగన్ కోరారు.
Share this article :

0 comments: