వైఎస్సార్‌సీపీకి విప్ జారీ చేసే హక్కుంది.. అది చెల్లుతుంది. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీకి విప్ జారీ చేసే హక్కుంది.. అది చెల్లుతుంది.

వైఎస్సార్‌సీపీకి విప్ జారీ చేసే హక్కుంది.. అది చెల్లుతుంది.

Written By news on Wednesday, July 2, 2014 | 7/02/2014

వైఎస్సార్‌సీపీకి విప్ జారీ చేసే  హక్కుంది.. అది చెల్లుతుంది.
పార్టీ నేతలకు వెల్లడించిన ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్
సోమిరెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ సీపీ వినతి
తీవ్రంగా ధ్వజమెత్తిన అంబటి రాంబాబు


హైదరాబాద్: ‘‘ఈ నెల 3, 4, 5 తేదీల్లో స్థానిక సంస్థల పదవులకు జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేసే హక్కు, అధికారం ఉన్నాయి. ఆ పార్టీ జారీ చేసే విప్ చెల్లుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ తమకు స్పష్టంగా చెప్పారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించే నాటికి వైఎస్సార్సీపీకి గుర్తింపు లేదు కనుక విప్ జారీ చేసే అధికారం ఆ పార్టీకి లేదని, ఒకవేళ జారీ చేసినా అది చెల్లదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రకటన చేయడంపై ఎన్నికల కమిషన్ కార్యదర్శికి ఫిర్యాదు చేశామని తెలిపారు. సోమిరెడ్డి తప్పుడు ప్రకటనను మిట్టల్ దృష్టికి తేగా ఆయన పైవిధంగా వివరణ ఇచ్చారని రాంబాబు చెప్పారు. అంబటి రాంబాబుతో పాటు పార్టీ నేత వాసిరెడ్డి పద్మ మంగళవారం ఎన్నికల కమిషన్‌ను కలిశారు.

ఆ తర్వాత రాంబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీని, ప్రజలను గందరగోళ పరిచేందుకే సీఎం చంద్రబాబు..  సోమిరెడ్డితో నాటకం ఆడిస్తున్నారని ధ్వజమెత్తారు.
 సోమిరెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి..: స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రలోభపెడుతూ వారిని పార్టీలు మారినా తప్పులేదని ప్రోత్సహించేలా ప్రకటన జారీ చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.  
Share this article :

0 comments: