వైఎస్సార్‌సీపీ నేతలకు జగన్ అభినందనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ నేతలకు జగన్ అభినందనలు

వైఎస్సార్‌సీపీ నేతలకు జగన్ అభినందనలు

Written By news on Monday, July 21, 2014 | 7/21/2014

వైఎస్సార్‌సీపీ నేతలకు జగన్ అభినందనలు
  వైఎస్సార్‌సీపీ నెల్లూరు జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్నందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా నేతలకు అభినందనలు తెలిపారు. అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుని ఎట్టకేలకు పార్టీ విజయానికి కృషి చేసిన నేతలను ఆదివారం ఆయన ప్రశంసించారు.
 
 ముఖ్యంగా నెల్లూరు ఎంపీ, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఇన్‌చార్జిగా వ్యవహరించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి సాయంత్రం వైఎస్ జగన్ ఫోన్ చేసి అభినందించారు. వీరితో పాటు జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నెల్లూరు మేయర్‌ను, చైర్మన్‌గా ఎన్నికైన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి కూడా జగన్ అభినందనలు తెలిపారు. జిల్లాలో పార్టీ పటిష్టతను పెంచాలని ఆయన సూచించారు.
Share this article :

0 comments: