అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ భేటీ

అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ భేటీ

Written By news on Friday, July 11, 2014 | 7/11/2014

అరుణ్ జైట్లీతో వైఎస్ జగన్ భేటీవీడియోకి క్లిక్ చేయండి
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. విభజన నేపథ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ లో తలెత్తిన సమస్యలను జైట్లీకి దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు విజ్ఞాపన ప్రతం సమర్పించారు. తాము చెప్పిన విషయాలను ఆర్థిక మంత్రి సావధానంగా విన్నారని భేటీ అనంతరం వైఎస్ జగన్ తెలిపారు. తమ విజ్ఞాపనల పట్ల సానుకూలంగా స్పందించారని చెప్పారు.

లోటు బడ్జెట్‌తో ఉన్న ఏపీలో సదుపాయాల కొరత ఏర్పడిందని, ఐటీ కార్యకలాపాలు లేవని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఏపీకి మౌళిక వస్తువుల తయారీ ,ఉన్నత విద్యా, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు చాలా అవసరమని అన్నారు. ఉన్నతమైన ప్రమాణాలతో రాజధాని నిర్మాణం చేయాలని సూచించారు. పన్ను రాయితీలను కల్పించాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదాను, ప్రత్యేక ఆర్ధిక ప్రోత్సాహక ప్యాకేజీని 15 సంవత్సరాలపాటు ఇవ్వాలని కోరారు. ఇవన్నీ జరగాలంటే పెద్దమొత్తంలో ఆర్ధిక సహాయం కావాలంటూ లేఖలో వైఎస్ జగన్ పేర్కొన్నారు.

విభజన బిల్లులో పేర్కొన్నట్లుగా రాష్ట్రానికి నిట్, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ విపత్తుల నిర్వహణ విశ్వవిద్యాలయాన్ని తొందరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 13వ షెడ్యూల్‌లో పేర్కొన్నట్లుగా కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో పెట్రోలియం కాంప్లెక్స్‌, విశాఖపట్నం,విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేయాలని కోరారు. విశాఖలో మెట్రో రైల్, విజయవాడ-తెనాలి-గుంటూరులలో మెట్రోపాలిటిన్ అర్బన్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
Share this article :

0 comments: