శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షరతులు లేకుండా రుణాలు మాఫీ చేయాలని మాజీమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. రుణమాఫీపై మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు అమలు చేస్తుంటూ చంద్రబాబు మాత్రం సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ధర్మాన విమర్శించారు. కాగా వ్యవసాయ రుణాలు తీసుకున్నవారికి ప్రస్తుతానికి రీషెడ్యూల్ మాత్రమే చేస్తామని, రుణమాఫీ గురించి తర్వాతే ఆలోచిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Home »
» ఒక్కొక్కరు ఒక్కోరకంగా...
ఒక్కొక్కరు ఒక్కోరకంగా...
Written By news on Thursday, July 17, 2014 | 7/17/2014
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment