
అప్పటికే పాతబకాయిలు చెల్లించి బ్యాంకుల ద్వారా కొత్త రుణాలు పొందాల్సి ఉందన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తారని రైతులు వేయి కళ్లతో ఎదురుచూశారన్నారు. అయినా బాబు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని మేరిగ విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు రీ షెడ్యూల్ అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారని మేరిగ విమర్శించాడు. చంద్రబాబు చెప్పినట్టు రీషెడ్యూల్ ద్వారా రుణాలు అందించే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటికే బ్యాంకు రుణాలకు వడ్డీలు పెరిగిపోతున్నాయన్నారు. ఇక డ్వాక్రా రుణాల పరిస్థితి ఇంతకు తక్కువేమీ కాదన్నారు. పేరుకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పినా దీనిపై కూడా స్పష్టత లేదన్నారు.
డ్వాక్రా రుణాలు రీ షెడ్యూల్ చేసే పరిస్థితి లేదని మేరిగ చెప్పారు. ఈ నెల చివరకు పంటల బీమా గడువు ముగుస్తుందన్నారు. ఇంతలోపు రైతులు రుణాలు పొందకపోతే భవిష్యత్‌లో పంటలు నష్టపోయినా బీమా వర్తించదన్నారు. ఇప్పటికైనా బాబు అబద్ధాలు మాని చిత్తశుద్ధితో అన్నదాతను ఆదుకునేందుకు ప్రయత్నించాలని మేరిగ మురళీధర్ హితవు పలికారు. రైతులకు అన్యాయం జరగకూడదని తమ పార్టీ ఆందోళనలకు దిగిందని మేరిగ చెప్పారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పాండురంగారెడ్డి పాల్గొన్నారు.
0 comments:
Post a Comment