మహిళలపై దౌర్జన్యం సిగ్గుచేటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహిళలపై దౌర్జన్యం సిగ్గుచేటు

మహిళలపై దౌర్జన్యం సిగ్గుచేటు

Written By news on Monday, July 7, 2014 | 7/07/2014

టీడీపీ వికృత చేష్టలు ఆపాలి
- మహిళలపై దౌర్జన్యం సిగ్గుచేటు
- వైఎస్సార్ సీపీ మహిళా నేతల ధ్వజం

 ఒంగోలు అర్బన్ : టీడీపీ నాయకులు, కార్యకర్తలు వికృత చేష్టలు మానుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా, పట్టణ  మహిళా విభాగం నాయకులు హితవు పలికారు. గతంలో టీడీ పీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలను గుర్రాలతో తొక్కించారని, అదే సంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా టీడీపీకి ఇంకా అధికార దాహం తీరలేదని ఎద్దేవా చేశారు.

స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం మహిళా నేతలు విలేకర్ల్లతో మాట్లాడారు. మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ మాట్లాడుతూ.. శనివారం ఒంగోలులో నిర్వహించిన జెడ్పీటీసీల ప్రత్యేక సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. వైఎస్సార్ సీపీ మహిళా జెడ్పీటీసీ సభ్యులపై దౌర్జన్యం చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ సీపీకి 31 మంది జెడ్పీటీసీలతో స్పష్టమైన మెజారిటీ ఉంటే, 25 మంది సభ్యులు మాత్రమే ఉన్న టీడీపీ ప్రలోభాలకు, దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు. మహిళలకు రక్షణ కల్పిస్తామన్న చంద్రబాబు.. మహిళా జెడ్పీటీసీలపై టీడీపీ నేతల దుశ్చర్యలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.

ఇప్పటికైనా టీడీపీ దురాగతాలు ఆపి ప్రజా సంక్షేమం, హామీల అమలు గురించి ఆలోచిస్తే మంచిదని హితవు పలికారు. డబ్బుకు అమ్ముడుపోయే నాయకులు వైఎస్సార్ సీపీలో లేరని స్పష్టం చేశారు. ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ బడుగు ఇందిర మాట్లాడుతూ.. మహిళల రక్షణకు చట్టాలు చేస్తామని చెప్పి దాడులకు తెగబడటం, ప్రలోభాలకు గురిచేయడం హేయమన్నారు.

జెడ్పీటీసీ చైర్మన్ ఎంపిక రోజున టీడీపీ మహిళా సభ్యులను కూర్చోబెట్టిన పోలీసులు.. వైఎస్సార్సీపీ మహిళలను అడ్డుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీకి పోలీసు యంత్రాంగం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ప్రజాతీర్పును గౌరవించాలని టీడీపీ నేతలకు సూచించారు. సమావేశంలో పట్టణ ప్రచార కమిటీ సభ్యురాలు బత్తుల ప్రమీల, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ దామరాజు క్రాంతికుమార్ పాల్గొన్నారు.
Share this article :

0 comments: