లోక్ సభలో ఆకట్టుకున్న కొత్తపల్లి గీత ప్రసంగం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లోక్ సభలో ఆకట్టుకున్న కొత్తపల్లి గీత ప్రసంగం

లోక్ సభలో ఆకట్టుకున్న కొత్తపల్లి గీత ప్రసంగం

Written By news on Wednesday, July 9, 2014 | 7/09/2014

లోక్ సభలో ఆకట్టుకున్న కొత్తపల్లి గీత ప్రసంగం
న్యూఢిల్లీ: ఆకాశానంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత కోరారు. లోక్ సభలో తొలిసారిగా మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ధరల గురించి ప్రస్తావించారు.

తమ బతుకులను బాగుచేస్తారనే నమ్మకంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు సంపూర్ణ మెజారిటీతో అధికారం కట్టబెట్టారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మోడీ సర్కారు ఉందన్నారు. ధరల పెరుగుదలను అరికట్టి సామాన్యులపై భారం తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల వ్యవస్థను సంస్కరించాలని సూచించారు. దేశమంతా 'ఒకే ధర' విధానాన్ని అమలు చేయాలని కోరారు.

తొలిసారిగా లోక్ సభలో మాట్లాడిన కొత్తపల్లి గీత ఏ మాత్రం తొణక్కుండా తాను చెప్పాల్పింది చెప్పారు. ఆమె ప్రసంగాన్ని సభ్యులు శ్రద్ధగా విన్నారు.  ఆమె లోక్ సభలో మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ స్థానంలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ ఉండడం విశేషం.
Share this article :

0 comments: