సాక్షి ప్రతినిధి, విజయనగరం: శాసన సభలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కే రంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజులు ఆదివారం తెలిపారు. ఈ నెల 15,16వ తేదీల్లో జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటించిచెన్నైలో 12 అంతస్తుల నిర్మాణ భవనం కూలిన సంఘటనలో మృతి చెందిన జిల్లా వాసుల కుటుంబ సభ్యుల ను పరామర్శించనున్నారని తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..
ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు జగన్ మోహన్‌రెడ్డి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలం కోరపు కృష్ణాపురానికి చేరుకుంటారు. ఆ గ్రామం నుంచి పొట్టకూటి కోసం చెన్నై వెళ్లి మృతి చెందిన ఏడుగురి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం బాడంగి చేరుకుని.. ఇదే ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.
అక్కడి నుంచి బొబ్బిలి చేరుకుని రాత్రి బస చేస్తారు. 16న సాలూరు నియోజకవర్గం మక్కువ మండలానికి చెందిన తూరుమామిడి, పెదగైశిల గ్రామాలకు వెళ్లి ఆయా గ్రామాలకు చెందిన మృతుల కుటుం బాలను పరామర్శిస్తారు. అనంతరం కురుపాం నియోజకవర్గం పరిధిలోని కొమరాడ మండలం దళాయిపేట, మాదలంగి గ్రామాల్లోని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి జియ్యమ్మవలస మండ లం నీలమాంబపురం చేరుకుని గ్రామానికి చెందిన ఐదుగురు మృతుల కుటుంబసభ్యులను పరామర్శిస్తా రు. అదే రోజు సాయంత్రానికి శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశిస్తారు. ఆ జిల్లాలో కూడా చెన్నై ప్రమాద ఘటనలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.

0 comments:
Post a Comment