వైఎస్సార్‌సీపీ విప్ వంద శాతం చెల్లుతుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ విప్ వంద శాతం చెల్లుతుంది

వైఎస్సార్‌సీపీ విప్ వంద శాతం చెల్లుతుంది

Written By news on Tuesday, July 1, 2014 | 7/01/2014

వైఎస్సార్‌సీపీ విప్ వంద శాతం చెల్లుతుంది
మైసూరా, అంబటి స్పష్టీకరణ

 హైదరాబాద్ :  జూలై 3, 4, 5 తేదీల్లో జరిగే ‘స్థానిక’ పరోక్ష ఎన్నికలు పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసే విప్ నూ టికి నూరు శాతం చెల్లుతుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యు డు ఎంవీ మైసూరారెడ్డి, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో టీడీపీ నేతల మాటలు, చేస్తున్న ప్రచారం అభూత కల్పనలని వారు పేర్కొన్నారు. విప్ ఉల్లంఘించే సభ్యులపై వేటు తప్పదని హెచ్చరించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద వారు మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను అనైతికంగా తన వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ రాజకీయ దిగజారుడుతనానికి పాల్పడుతోందని మైసూరా, అంబటి మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన (27.06.2014) నోటిఫికేషన్‌లో సైతం వైఎస్సార్ సీపీని రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీగా పేర్కొన్నందున.. విప్ చెల్లుతుందని వారు తెలిపారు.
Share this article :

0 comments: