సమంజసం కాదు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమంజసం కాదు: వైఎస్ జగన్

సమంజసం కాదు: వైఎస్ జగన్

Written By news on Saturday, July 5, 2014 | 7/05/2014

సమంజసం కాదు: వైఎస్ జగన్
ఏపీఎన్జీవోల భూమి స్వాధీనంపై వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలకు హైదరాబాద్‌లో కేటాయించిన 189 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే తిరిగి ఆ భూములను ఏపీఎన్జీవోలకు అప్పగించాలని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
 
ఈ భూముల కేటాయింపు రెండు దశాబ్దాల కిత్రమే జరిగిందని, ఆ భూమిని ప్రభుత్వ ఉద్యోగులు ప్లాట్లుగా విభజించుకుని.. అంతర్గత రోడ్లు, ఇతర సౌకర్యాల అభివృద్ధికోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేసుకున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వారికి కేటాయించిన భూములను రద్దు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వేరెవరికైనా భూ కేటాయింపులు చేయదలుచుకుంటే ప్రత్యామ్నాయంకోసం చూడాలి తప్పిస్తే, ఈ భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదని సూచించారు. ఈ భూములను తిరిగి ఏపీఎన్జీవోలకు అప్పగించడమే న్యాయమన్నారు. ఈ విషయంలో ఏవైనా సమస్యలుంటే వాటిపై ఏపీ ప్రభుత్వం కలుగజేసుకుని ఏపీఎన్జీవోలకు అండగా నిలబడాలని కోరారు
Share this article :

0 comments: