చంద్రబాబును నిలదీసిన డ్వాక్రా మహిళలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబును నిలదీసిన డ్వాక్రా మహిళలు

చంద్రబాబును నిలదీసిన డ్వాక్రా మహిళలు

Written By news on Sunday, July 20, 2014 | 7/20/2014

రుణాలెప్పుడు రద్దుచేస్తారు..?
నెల్లూరులో సీఎం చంద్రబాబును నిలదీసిన డ్వాక్రా మహిళలు
 
నెల్లూరు: డ్వాక్రా రుణాలను ఎప్పుడు రద్దు చేస్తారని తెలుగింటి ఆడపడుచులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిలదీశారు. ముఖ్యమంత్రిగా తాను పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతుండగా డ్వాక్రా మహిళలు అడ్డుకుని, రుణాలను ఎప్పుడు రద్దుచేస్తారని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సమాధానం దాటవేశారు. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా కేంద్రంలో జరిగింది. నెల్లూరులో శనివారం సాయంత్రం ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలను చంద్రబాబునాయుడు ప్రారంభించగా, ఈ సభలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా డ్వాక్రా రుణాలు రద్దు చేయాలని మహిళలు నిలదీశారు. తప్పకుండా తల్లీ ఆలోచిస్తున్నా.. తొందరలో నిర్ణయం తీసుకుంటానంటూ సీఎం సమాధానం చెప్పారు.
Share this article :

0 comments: