సీఎం అయ్యాక కూడా దిగజారుడు రాజకీయమేనా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం అయ్యాక కూడా దిగజారుడు రాజకీయమేనా?

సీఎం అయ్యాక కూడా దిగజారుడు రాజకీయమేనా?

Written By news on Tuesday, July 1, 2014 | 7/01/2014

సీఎం అయ్యాక కూడా దిగజారుడు రాజకీయమేనా?వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక కూడా దిగజారుడు రాజకీయం సమంజసమేనా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  చంద్రబాబూ.. నీకు ఎందుకంత అధికారదాహం అని నిలదీశారు. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే దురుద్దేశంతో సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను బలవంతంగా ఎత్తుకెళ్లారని అంబటి మీడియాకు తెలిపారు. 
 
ఎంపీటీసీలను ఎత్తుకుపోయిన విషయాన్ని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని ఆయన మీడియాకు తెలిపారు. స్పీకర్‌ కోడెల శివప్రసాద్ రావు నియోజకవర్గంలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎలా అని అంబటి ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విప్ జారీచేసే అధికారం ఉందని ఎలక్షన్‌ కమిషన్‌ స్పష్టం చేసిన విషయాన్ని అంబటి రాంబాబు మీడియాకు తెలిపారు. 
Share this article :

0 comments: