ఏమాశించి పొగుడుతున్నారో! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏమాశించి పొగుడుతున్నారో!

ఏమాశించి పొగుడుతున్నారో!

Written By news on Sunday, July 13, 2014 | 7/13/2014

2020నా... లేక 420నా?
చంద్రబాబుకు అంబటి సూటి ప్రశ్న
అసలు సీమాంధ్రలో ప్రభుత్వం ఉందా?


సాక్షి, హైదరాబాద్: నెలరోజులకుపైగా సీమాంధ్రలో సాగిన పరిపాలన విజన్ 2020 మాదిరిగా ఉందా లేక 420 లాగా ఉందో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు వెల్లడై రెండు నెలలైందని, బాబు సీఎం పీఠమెక్కి నెలా నాలుగు రోజులైందని, ఈ సమయంలో అసలు సీమాంధ్రలో ప్రభుత్వం ఉందా.. లేదా! అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

తొలి సంతకాలు చేసిన ఒక్క వాగ్దానమూ అమలు చేయకుండా జనాన్ని మోసగించారని దుయ్యబట్టారు. రైతు రుణాలు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికుల రుణాల మాఫీకోసం సంతకం చేసిన ఆయన ఒక్క పైసా రుణాన్నీ మాఫీ చేయలేదన్నారు. రీషెడ్యూలు అనేమాటను తెరపైకి తెచ్చి మభ్య పెడుతున్నారన్నారు. రీషెడ్యూలు అంటే రుణం చెల్లింపు గడువు వాయిదా పడుతుందే తప్ప మాఫీ కాదన్నారు. మన రాష్ట్రానికి మనం త్వరగా వెళ్లిపోదామని గొప్పలు చెప్పిన బాబు ప్రమాణ స్వీకారం చేసిన ప్పటి నుంచీ మూడు రోజులు కూడా సీమాంధ్రలో ఉండి పాలన సాగించలేదని ఆయన దుయ్యబట్టారు.

చంద్రబాబును అశోక్‌బాబు ఏమాశించి పొగుడుతున్నారో!
తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వోద్యోగులను పెట్టిన బాధలను వారింకా మర్చిపోలేదని,  ఎన్జీవోల నేత అశోక్‌బాబు ఏమాశించి సీఎంను అలా పొగుడుతున్నారో ఆయనకే తెలియాలన్నారు. బహుశా బాబు సీఎం అయ్యాక అశోక్‌బాబుకు జ్ఞానోదయం అయినట్టుగా ఉందన్నారు. హైదరాబాద్‌లో ఓవైపు 58 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆంధ్రా ఉద్యోగులు రిటైరైపోతుంటే, అశోక్‌బాబు విజయవాడలో బాబును సన్మానించడంలో  ఔచిత్యాన్ని అంబటి ప్రశ్నించారు.
Share this article :

0 comments: