
శ్రీకాకుళం: కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడిచేందుకు.. బాధితుల బతుకు బాధలు తెలుసుకునేందుకు.. అండగా నేనున్నాంటూ తమిళనాడులోని చెన్నై భవనం కూలిన ఘటనలో బాధితులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.
తమిళనాడులోని చెన్నై సమీపంలో చోటు చేసుకున్న భవనం కూలిన దుర్ఘటనల్లో మృతి చెందిన జిల్లావాసుల కుటుంబాలను గురువారం వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని పొల్లివలసలో సింహాచలం కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట, టెక్కలి, పాలకొండ నియోజకవర్గాల పరిధిలో పొట్టకూటి కోసం వలస చెన్నై ప్రాంతానికి వెళ్లిన వారిలో 14 మంది భవనం కూలిన ఘటనలో చనిపోగా ఇద్దరు గాయపడ్డారు.
కొద్ది రోజుల వ్యవధిలోనే తిరువళ్లూరు జిల్లాలో గోడ కూలిన దుర్ఘటనలో మరో 9మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. వీరి కుటుంబాలను జగన్ తన పర్యటనలో పరామర్శించి, అండగా ఉంటానని భరోసా ఇవ్వనున్నారు.
0 comments:
Post a Comment