తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత

తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత

Written By news on Sunday, July 20, 2014 | 7/20/2014

తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత
పుంగనూరు: ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా ఉండేలా తగు చర్యలు తీసుకుని సమస్య పరి ష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం పుంగనూరు షాదిమహాల్‌లో ముస్లిం మైనార్టీల నాయకుడు ఖాదర్‌బాషా ఏర్పా టు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖాదర్‌బాషా, అంజుమన్ అధ్యక్షుడు అమీర్‌జాన్‌తో పాటు ముస్లిం నేతలు ఎంపీ మిథున్‌రెడ్డిని శాలువకప్పి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లు ఇబ్రహిం, అమ్ము, నయాజ్, ఆసిఫ్‌లను ఎంపీ మిథున్‌రెడ్డి సన్మానించారు. అనంతరం ముస్లిం నాయకుడు ఖాదర్‌బాషా 1500 మం దికి దుస్తులు, వంట సామాగ్రిని ఉచితంగా అందజేశారు. వాటిని మిథున్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మంచి నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి, సమస్య పరిష్కారానికి ప్రణాళికలు చేపట్టామన్నారు.

ప్రాంతాల వారీగా మంచినీటి బోర్లు, పైపులైన్లు వేస్తామన్నారు. ఎంపీ నిధులను పూర్తి స్థాయిలో మంచి నీటి సమస్య పరిష్కారానికే ఖర్చు చేసేందుకు నిర్ణయించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచినీటి సమస్యను తీర్చేందుకు అవసరమైతే ట్యాంకర్లను ఏర్పా టు చేసి నీటిని సరఫరా చేస్తామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతా ల్లో ఉన్న సమస్యలను గుర్తించి, ప్రణాళికాబద్దంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొంతసేపు ఉర్దూలో ప్రసంగించడంతో ముస్లింలు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు.
 
ముస్లిం మైనార్టీలను ఆదుకుంటాం
 
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వారిని ఆదుకుంటామని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. తండ్రి ఆశయాల మేరకు జగన్‌మోహన్‌రెడ్డి పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ చేపట్టలేని విధంగా ముస్లిం మైనార్టీల కోసం భాస్కర్‌రెడ్డి ట్రస్ట్ ద్వారా కోట్లాది రూపాయలు నిధులు విరాళంగా అందజేస్తున్నామని తెలిపారు. షాదిమహళ్లకు, మసీదుల నిర్మాణానికి తమ వంతు విరాళాలు అందజేస్తున్నట్టు తెలిపారు.

రానున్న రోజుల్లో ముస్లిం మైనార్టీలకు మరిన్ని అవకాశాలు కల్పించి, వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నేత లు ఇనాయతుల్లా షరీఫ్, ఫకృద్ధిన్ షరీఫ్, ఎంఎస్.సలీం, ఖాదర్, కిజర్‌ఖాన్, ఖాన్, రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, మురుగప్ప, ఆవుల అమరేంద్ర, జయక్రిష్ణ, రాజేష్, కుమార్, సూరి తదితరులు పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: