రీషెడ్యూల్ పేరుతో ఏపీ సర్కారు నయా డ్రామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రీషెడ్యూల్ పేరుతో ఏపీ సర్కారు నయా డ్రామా

రీషెడ్యూల్ పేరుతో ఏపీ సర్కారు నయా డ్రామా

Written By news on Thursday, July 10, 2014 | 7/10/2014

రీషెడ్యూల్ పేరుతో ఏపీ సర్కారు నయా డ్రామా
వైఎస్సార్‌సీఎల్పీ ఉప నేత జ్యోతుల ధ్వజం
 సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాలను మాఫీ చేస్తారో లేదో చెప్పకుండా రీషెడ్యూలుకు రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అంగీకరించిందని చెప్పి చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రామాలెందుకు ఆడుతోందని వైఎస్సార్‌సీ ఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని బుధవారం డిమాండ్ చేశారు.
 
రుణాలను రీషెడ్యూల్ చేయడం కొత్తేమీ కాదని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు నిబంధనల ప్రకారం అమలు చేసేదేనని తెలిపారు. అయితే, రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అదేదో ఇప్పుడే జరుగుతున్నట్లు మరో డ్రామాకు తెరలేపుతున్నారని, రుణ మాఫీపై స్పష్టత ఇవ్వకుండా దాటవేసే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు.
 
 డాక్యుమెంట్ల మాటేమిటి? నగలు తిరిగి ఇస్తారా?
 ‘‘రీషెడ్యూల్ చేస్తే అప్పుల కోసం రైతులు బ్యాంకుల్లో ఉంచిన డాక్యుమెంట్లు, కుదువపెట్టిన ఆడపడుచుల నగలు తిరిగి రావు. వాటిని రైతులకు ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందా? ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలి, రైతుల డాక్యుమెంట్లను, బంగారాన్ని ఇప్పించాలి’’ అని నెహ్రూ కోరారు.
Share this article :

0 comments: