కంట నీరు తుడుస్తూ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కంట నీరు తుడుస్తూ...

కంట నీరు తుడుస్తూ...

Written By news on Wednesday, July 16, 2014 | 7/16/2014

కంట నీరు తుడుస్తూ...
ఎవరిని కదిలించినా కన్నీళ్లు, ఏ ఒక్కరిని పలకరించినా కష్టాలు. చెన్నైలో జరిగిన ఘోర భవన ప్రమాదంలో మృతి చెందిన వారిలో పలువురి కుటుంబ సభ్యులను వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమ కష్టాలను ఆయనకు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉన్న ఊళ్లో బతకలేక అక్కడకు వెళితే మృత్యువు వెంటాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం ఎలా జరిగింది, పరిహారం అందిందా లేదా అన్న విషయాలను జగన్ ఆరా తీశారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా పార్టీ తరఫున పోరాటం చేస్తామని భరోసానిచ్చారు.

 కర్రి తౌడమ్మ కుటుంబ సభ్యులతో...
 వైఎస్ జగన్: ప్రమాదం జరిగిపోయింది. ఏదీ మన చేతిలో లేదు. ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? (తౌడమ్మ భర్త అప్పలనాయుడును ఉద్దేశిస్తూ)

 అప్పలనాయుడు(కుటుంబ సభ్యులు రోదిస్తుండగా): ప్రమాదం జరిగినపుడు నేను 10 మీటర్ల దూరంలో ఉన్నాను. నన్ను టీ తెమ్మంటే వెళ్లాను. నిమిషంలో పెద్ద శబ్దం వచ్చి అపార్టుమెంట్ కూలిపోయింది. ఒకటో ఫ్లోర్‌లో 16 మంది ఉన్నారు. అన్ని ఫ్లోర్లలో పనిచేస్తున్నారు.

 జగన్: ఎన్నాళ్ల నుంచి పని చేస్తున్నారు?
 అప్పలనాయుడు: గత ఏడెనిమిదేళ్లుగా పనిచేస్తున్నాం సార్.

 జగన్:  అక్కడికెందుకు వెళ్తున్నారు. ఇక్కడ పనులు లేవా..?
 అప్పలనాయుడు: ముగ్గురు ఆడపిల్లలు. ఇద్దరికి పెళ్లి చేశాను. అప్పులు కావడంతో నేను మా ఆడది పనికి వెళ్లాం.

 జగన్ (పిల్లలు పార్వతి,కృష్ణలను ఉద్దేశించి): పిల్లలు చదువుకుంటున్నారా?
 అప్పలనాయుడు: చదువుతున్నారన్నా. పిల్లల్ని ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్పించింది.

 జగన్: ప్రమాదంపై ఎవరూ ఎవరినీ అడగలేదా?
 అప్పలనాయుడు: ఎవరు అడుగుతారు సార్. ఎవరూ అడగలేదు.

 జగన్: ప్రభుత్వం నుంచి సహాయం అందిందా?
 అప్పలనాయుడు: రూ.5 లక్షలు ఇచ్చారు సార్.

 పార్వతి: అన్నా ఇల్లు అంతా పాడైపోయింది. అప్పుల్లో ఉన్నాం. సాయం చేయండి.
 జగన్: ప్రభుత్వంతో మాట్లాడి చేద్దాం. మన ప్రభుత్వం ఇప్పుడు లేదు కదా. పిల్లల్ని బాగా చదివించండి.

 గౌరునాయుడు కుటుంబ సభ్యులతో...
 జగన్: ప్రమాదం జరిగినప్పుడు మీరెక్కడ ఉన్నారు?
 గౌరునాయుడు భార్య అనసూయ: నేను ప్రమాదంలో చిక్కుకు పోయి నాలుగు రోజుల తర్వాత బయటపడ్డానన్నా. నేను చచ్చిపోయాననుకున్నారు.

 జగన్: అయ్యో. నిజంగా అదృష్టవంతురాలివే. ఇక్కడ పనులు లేవా? అక్కడికి ఎందుకు వెళ్లిపోయారు?
 అనసూయ: నాలుగేళ్లుగా అక్కడే పనిచేస్తున్నాం. ఉపాధి పనుల్లో కూలి కిట్టదు బాబూ.

 జగన్: ఉపాధి పనులకు వెళ్తారా? ఎంత వేతనం వస్తుంది?
 అనసూయతోపాటు కుటుంబ సభ్యులు: పనికి వెళ్తే రూ.60, లేకపోతే రూ.70 వస్తాయి. చెన్నైలో అయితే ఆడాళ్లకి రూ.275, మగాళ్లకి రూ.375 ఇస్తారు. మా అప్పులు తీరుతాయి కదా.

 జగన్: పాప చదువుతోందా? ఎక్కడ చదువుతోంది?
 అనసూయ పాప విమల: ఇక్కడే చదువుతున్నాను.

 జగన్: ప్రైవేటు స్కూలా? ప్రభుత్వ స్కూలా?
 విమల: ప్రభుత్వ స్కూలే. ఎంపీపీ స్కూల్‌లో.

 జగన్(అనసూయ బావ సింహాచలంతో): మీకు వ్యవసాయం ఉందా. పిల్లలు ఏం చేస్తున్నారు.?
 సింహాచలం: వ్యవసాయం లేదండీ. మా అబ్బాయి సురేష్ ఐటీఐ చదువుతున్నాడు.

 జగన్(సురేష్‌తో): బాగా చదువుతున్నావా..?
 సురేష్: చదువుతున్నానన్నా. మేం అంతా మీ కోసం ఎదురుచూశాం.

 జగన్: మీకు మరింత సాయం అందేలా కృ షి చేస్తాను. పిల్లలు బాగా చదువుకోవాలి.
 కుటుంబ సభ్యులు: మీరు మా దగ్గరకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. మా బాధలు పంచుకున్నారు. మీరు రావడంతో మా కష్టాలు మరిచిపోయామన్నా.

 నాసిరకం నిర్మాణం వల్లనే...
 జగన్: ఏమ్మా! బంగారునాయుడు కుటుంబ మా మీరంతా..?
 బంగారు నాయుడు భార్య కృష్ణవేణి: అవునం డీ... మా పిల్లలు, అత్తా, మామలండీ.

 జగన్: ప్రమాదం జరిగినపుడు మీరు కూడా అక్కడే ఉన్నారా?
 కృష్ణవేణి: ఈ పాపలను ఇక్కడ వదిలేసి ఇద్దరమూ పనికి వెళ్లామండీ

 జగన్: పిల్లలు అక్కడ చదువుతున్నారా? ఇక్కడ చదువుతున్నారా?
 కృష్ణవేణి:ఇక్కడే చదువుతున్నారు బాబూ.

 జగన్:  ఎంత మందమ్మా.. మీరంతా అక్కడకు పనులకు వెళ్లింది?
 కృష్ణవేణి: 16 మందిమి వెళ్లామండీ. దానిలో ఏడుగురు చచ్చిపోతే, ఒకావిడి మాత్రం చచ్చి బతికింది. మిగతావాళ్లమంతా బతికి బయటపడ్డామండీ.

 జగన్: అక్కడ నుంచి ఏమైనా సహాయం అందిందా?
 కృష్ణవేణి: చంద్రబాబునాయుడు వచ్చి వాళ్లతోటి మాట్లాడారుగానీ ఇంతవరకూ ఏటీ ఇవ్వనేదు. తమిళనాడు గవర్నమెంటు రూ.2 లక్షలు ఇస్తామన్నా ఇవ్వలేదు.

 జగన్: ఇక్కడ నుంచి వెళ్లినవారు ఎంత మంది ఉంటారు?
 కృష్ణవేణి: మూడు వందల నుంచి నాలుగు వందల మంది వరకూ ఉంటారండీ. వర్షాలు పడితేనే పంటలు, లేకపోతే లేదు. నీటికి కూడా ఇబ్బందే. వర్షాలపై ఆధారపడాల్సి వస్తుంది.

 జగన్:  ఓనర్ పరిహారం ఏమైనా ఇచ్చాడా? ఎవరైనా మాట్లాడారా?
 కృష్ణవేణి: ఏటీ ఇవ్వనేదు బాబూ.

 జగన్:  తాత. నీకు ఎంత మంది కొడుకులు ఉన్నారు?
 బంగారునాయుడు తండ్రి తవుడు: నలుగురు బిడ్డలు బాబూ. చచ్చిపోయినోడు ఒక్కడే ఆ పనికి వెళ్తుంటాడు.

 జగన్:  బిల్డింగ్ ఎందుకు కూలిందో కారణాలు చెప్పగలరా?
 బావమరిది శ్రీను: 2009లో ఆ ఫ్లాటును పూర్తి చేయాలట సార్. ఇప్పటివరకూ ఇంకా కడుతూనే ఉంటే అక్కడ వారు కేసు వేశారట. దాంతో సంవత్సరంన్నరలోనే దీన్ని కట్టిసీ ఇచ్చేయాలని తొందర తొందరగా పనులు చేస్తున్నారు. ఇసుక వాడకుండా సిమెంటు, బుగ్గి కలిపేసి కట్టేస్తున్నారు.

 కృష్ణవేణి: ఆ బిల్డింగ్ కడుతున్నప్పుడు పుటిం గుల నుంచి మేమే పనిచేస్తున్నాం బాబూ.

 జగన్:  మీకు నెలకు ఎంత ఖర్చు అవుతుంది?
 కృష్ణవేణి: కడుతున్న దగ్గరే రూం సార్. అన్నీ ఆళ్లే ఇచ్చేవాళ్లు. మాకు అంతా కలిపి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుండేది సార్.

 జగన్:   చెన్నైకు ఇక్కడ నాయకులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల బృందాన్ని పంపి మీకు పరిహారం వెంటనే వచ్చినట్లు చూస్తాం. మా పార్టీ తరఫున కూడా ఆదుకుంటాం.

 దుర్గ కుటుంబంతో...
 జగన్(దుర్గ తల్లి గంగను ఉద్దేశించి..): మీ పాప ప్రమాదంలో చనిపోయిందా?
 గంగ: ఔను బాబూ.. నానే ఒంటరిగా ఉండిపోనాను. దుర్గ అయ్య చచ్చిపోనాడు. మేనమా మ, మేనత్తలతో పనికి వెళ్లి సచ్చిపోనాది బాబూ.

 జగన్: ప్రభుత్వ సహాయం అందిందా? అబ్బాయి చదువుతున్నాడా అమ్మా?
 గంగ: సాయం అందింది బాబూ. మా అబ్బాయిని బాడంగి గురుకుల పాఠశాలలో సదివించుతున్నాను.

 జగన్: చట్ట ప్రకారం బిల్డర్‌పై కేసు వేసి అందరికీ సాయం అందేలా చూద్దాం.
 గంగ తల్లి తవిటమ్మ: బాబూ నువ్వే ఆదుకోవాల. నాన్న ఇచ్చిన ఇల్లు కట్టుకుని అందులో ఉంటన్నం బాబూ.

 జగన్: తప్పకుండా అమ్మా. మా వరకు మేం న్యాయం చేస్తాం. మీకు వ్యవసాయం లేదా?
 గంగ: లేదు బాబూ. ఏ ఆధారం లేదు. లేకే పనులకెల్లాం బాబూ. మేమంతా మీ పార్టీ వోల్లమే బాబూ...
 జగన్: అబ్బాయిని బాగా చదివించు. అన్ని ర కాలుగా ఆదుకుంటాం. మేం ఉన్నాం.

 అందరూ కలిసి: అలాగే బాబూ మీది పెద్ద మనసు. మీరు ఇక్కడకు రావడం మాకు కొండంత ధైర్యం వచ్చినాది బాబూ.

 పతివాడ గౌరీశ్వరి కుటుంబ సభ్యులతో...

 జగన్: ఇంటిలో ఎంత మంది వెళ్లారు పనికి?
 గౌరీశ్వరి భర్త రాంబాబు: నేను, నా భార్య వెళ్లాం సార్.

 జగన్: మీ ఇద్దరూ ఒకే దగ్గర పనిచేస్తున్నారా?
 రాంబాబు: నేను అదే బిల్డింగులో ఉన్నా. నేను రూంకి వచ్చాను. ఈ లోగా మొత్తం ఒకే సారి కూలిపోయింది.

 జగన్: బిల్డింగ్ కూలడానికి కారణాలు ఏమై ఉంటాయి.?
 రాంబాబు: పిల్లర్లు బాగా లేవు బాబు.

 జగన్: తమిళనాడు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఏవీ రాలే దా?
 రాంబాబు: ఏవీ రాలేదు సార్. బిల్డింగ్‌కు సంబంధించిన వారు ఎవ్వరూ రాలేదు.

 జగన్: తమిళనాడుకు పార్టీ తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలను పంపుతాను. ఓనర్‌తో రాజీ కుదిరితే సరే సరి లేకపోతే కోర్టుకు వెళ్లి సంపాదించుకుందాం. మా పార్టీ తరఫున కూడా సాయం చేస్తాం. నువ్వు ఏమి చదుతున్నావమ్మా(పెద్ద కూతురు గౌతమిని ఉద్దేశించి).

 గౌతమి: ఆరో తరగతి చదువుతున్నాను సార్.
 జగన్: బాగా ఉందా స్కూలు

 గౌతమి: బాగుంది కానీ నేను హాస్టల్ లో ఉండి చదువుకుంటాను .
 జగన్: కస్తూర్బాలో చేర్పించే ఏర్పాట్లు చేస్తాం జాగ్రత్తగా చదువుకోమ్మా.

 ప్రమాదం నుంచి బయటపడిన మంత్రి మీనమ్మతో...

 జగన్: ఎలా బతికి బయటపడ్డావమ్మా?
 మీనమ్మ: నేను బతికి ఇలా మీ ముందుంటాననుకోలేదు బాబూ.

 జగన్:  ఎన్ని రోజులు శిథిలాల కింద ఉన్నావు?
 మీనమ్మ: మూడు రోజులు బాబు.

 జగన్: తిండి తిప్పలు లేకుండా మూడు రోజులున్నావా?
 మీనమ్మ: అవును బాబు. నేనున్న దగ్గరే నలుగురు పడిపోయాం. మా మీద శ్లాబు ఉంది. నాతో పాటు ఉన్న ముగ్గురు నేను చూస్తుండగానే గురక పెట్టి చచ్చిపోనారు. ఆళ్ల మధ్యనే నేను మూడు రోజులున్నాను.

 జగన్:  గట్టిదానివేనమ్మా నువ్వు? ఎక్కడైనా దెబ్బలు తగిలాయమ్మా?
 మీనమ్మ: దెబ్బలు బాగా తగిలాయి బాబు. ఇప్పటికీ నడవ లేకపోతున్నాను. రక్తం గూడు కట్టేసింది. బుర్రంతా మెత్తపడిపోయి బాధగా ఉంది. ఉన్న ఒక్కగా నొక్క కొడుకు కోసం ఈ బాధంతా..

 జగన్: మీ భర్త లేరా?
 మీనమ్మ: లేరండి మరో ఫ్యామిలీతో సాలూరులో ఉంటున్నారు. బాబును చదివించుకోవడానికి నేను మా బాబుతో అమ్మగారి ఇంటికి వచ్చేసి ఉంటున్నాను. 24 సంవత్సరాలుగా కన్నవారింటిలో ఉంటున్నాను. వాళ్లే పోషిస్తున్నారు.

 జగన్: ఎంత కాలంగా పనికి వెళ్తున్నాను.?
 మీనమ్మ: మూడు వారాలుగా వెళుతున్నాను బాబు.

 జగన్:  ప్రభుత్వం నుంచి సాయం ఏమైనా అందిందా?
 మీనమ్మ: ఇక్కడ గవర్నమెంటు రూ.50వేలు ఇచ్చింది. మరేటి ఇవ్వలేదు ఇంతవరకూ. ఉండడానికి ఇళ్లు లేదు.
  బాబు.

 జగన్:  పార్టీ తరఫున మీకు సాయం అందిస్తామమ్మా. తమిళనాడుకు మనవాళ్లను పంపించి మీకు న్యాయం చేస్తాం.
Share this article :

0 comments: