నెల్లూరు జెడ్పీ చైర్మన్ గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెల్లూరు జెడ్పీ చైర్మన్ గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి

నెల్లూరు జెడ్పీ చైర్మన్ గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి

Written By news on Sunday, July 20, 2014 | 7/20/2014


నెల్లూరు జెడ్పీ చైర్మన్ గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి
నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఎన్నికయ్యారు.  ఆసక్తికరంగా సాగిన ఎన్నికల ప్రక్రియ రాజకీయ వర్గాలను ఉత్కంఠకు గురిచేసిన ఈ ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జిల్లాలో 46 జెడ్పీటీఎస్ స్థానాలుండగా, వైఎస్ఆర్ సీపీకి చెందిన 8 మంది మద్దతు తెలపడంతో టీడీపీకి 23 మంది సభ్యుల బలం చేకూరింది. 
 
దాంతో వైఎస్ఆర్సీపీ (23), టీడీపీ(23)లు ఓట్లు సమానంగా ఉండటంతో లాటరీ పద్దతి ద్వారా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైస్ చైర్మన్ గా పీ.శిరీషలు ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిచండంతో పార్టీ శిబిరంలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని ఆనందాన్ని పంచుకున్నారు. 
Share this article :

0 comments: