టీడీపీ సాధించిన విజయం చెత్తబుట్టలో ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ సాధించిన విజయం చెత్తబుట్టలో ...

టీడీపీ సాధించిన విజయం చెత్తబుట్టలో ...

Written By news on Thursday, July 3, 2014 | 7/03/2014

టీడీపీ సాధించిన విజయం చెత్తబుట్టలో ...
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. గురువారం హైదరాబాద్ లో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని ఆమె అభివర్ణించారు. టీడీపీ  నేతలు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని అన్నారు.
 
టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని సాధించిన ఈ విజయాన్ని చెత్తబుట్టలో వేయడానికి తప్ప ఎందుకు పనికిరాదన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగులో కోరం ఉన్నా ఛైర్మన్ ఎన్నిక రేపటికి ఎందుకు వాయిదా వేశారంటూ ప్రభుత్వాన్ని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ప్రలోభాలకు గురి చేయడం దారుణమని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: