పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం

పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం

Written By news on Friday, July 11, 2014 | 7/11/2014

పూర్ణ, ఆనంద్ లకు వైఎస్ భారతి సన్మానం
హైదరాబాద్: అతి పిన్నవయస్సులో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిన మాలావత్ పూర్ణ, సాధనపల్లి ఆనంద్‌కుమార్‌లను సాక్షి మీడియా గ్రూప్ చైర్ పర్సన్ వైఎస్ భారతి సన్మానించారు. ఈ సందర్భంగా సాహసయాత్ర వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణాన్ని ఎదిరించి ఎవరెస్టు శిఖరంపై భారతపతాకాన్ని ఎగురువేసి యువతీయువకుల్లో అంతులేని విశ్వాసం నింపారని ప్రశంసించారు. మీ విజయం మరెందరికో స్ఫూర్తినిస్తుందని అన్నారు. పూర్ణ, ఆనంద్ లకు ఉజ్వల భవిష్యత్ సొంతం కావాలని వైఎస్ భారతి ఆకాంక్షించారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఈ ఇద్దరు ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించిన తెలుగు తేజాలుగా నిలిచారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా 14 ఏళ్ల మాలావత్ పూర్ణ రికార్డు సృష్టించింది.
Share this article :

0 comments: