వైఎస్ జగన్ కు చంద్రబాబుకు తేడా ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ కు చంద్రబాబుకు తేడా ?

వైఎస్ జగన్ కు చంద్రబాబుకు తేడా ?

Written By news on Wednesday, July 30, 2014 | 7/30/2014

వైఎస్ జగన్ కు చంద్రబాబుకు తేడా ఏమిటి?చంద్రబాబు నాయుడు - వైఎస్ జగన్
ఆంధ్ర్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు నెల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులకు మధ్య తేడా ఏమిటా? అని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే పోటీ జరిగిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, ఉభయకమ్యూనీస్టులు ఒక్క శాసనసభా స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. మెజార్టీ స్థానాలను గెలుచుకొని అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్ధానాలను ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. రుణాలు మాఫీ చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రుణాల మాఫీపై తొలి సంతకం అన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు అతీగతీలేదు. అంటే తొలి సంతకం హామీకే దిక్కులేదంటే, ఆ తరువాత సంతకాల పరిస్థితి ఏమిటి?

 రాష్ట్రంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. రుణాలు మాఫీ గురించి గానీ, రాష్ట్ర రాజధాని ఏర్పాటు గురించి గానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు రోజుకో రకంగా మాట్లాడుతూ ప్రజలను ఆయోమయంలో పడేస్తున్నారు. ఇక విద్యార్థుల ఫీజురీయింబర్స్ మెంట్ పరిస్థితి ఏమిటో అర్థంకాని పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అనేది అర్ధం కావడంలేదు. ప్రభుత్వం దివాళా తీసిందని గత ప్రభుత్వాలను విమర్శించడమే చంద్రబాబు నాయుడు  ధ్యేయంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్నిక ప్రచారంలో ఇచ్చిన హామీలు గాలికి వదిలి రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. పరిపాలన మాటేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హామీల అమలు విషయంలో ఇప్పుడు వనరుల సమీకరణ ఏమిటని అడుగుతున్నారు. 9 ఏళ్లు పరిపాలన చేసిన చంద్రబాబుకు వనరుల విషయం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ప్రధాన పార్టీలకు చెందిన ఇద్దరి నేతల మధ్య తేడా విషయమై ప్రజలు చర్చించుకుంటున్న  ముఖ్యమైన అంశాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.

చంద్రబాబు నాయుడు:
1.అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యం. (గతానుభవాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు)
2. అధికారంలోకి రావడం కోసం ముందు వెనక ఆలోచనలేకుండా హామీలు గుప్పించారు.
3.రుణ మాఫీ సాధ్యం కాదని తెలిసి కూడా రైతులను, మహిళలను నమ్మించారు.
4. అధికారం దక్కించుకోవడానికే  ప్రధాన్యత ఇచ్చి ఎన్నికల వ్యూహం పన్నారు.
5.రాజకీయ అనుభవంతో ప్రజలను మోసం చేశారు.
6.అమలు చేయడం సాధ్యం కాని హామీలు ఇచ్చారు.
7. 9 ఏళ్ల అనుభవం ఉన్నా పాలనపైన, వనరులపైన స్పష్టతలేదు.
8. రైతులను మోసం చేయడానికి వెనుకాడలేదు.
9. వ్యసాయ బంగారు రుణాలు, డ్వాక్రా రుణాల విషయంలో మహిళలను మోసం చేశారు.
10. ఏరకంగానైనా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని అంతకు ముందు తీవ్రంగా విమర్శించిన బిజెపితో పొత్తు, పవన్ కళ్యాణ్ మద్దతు కూడగట్టుకున్నారు.

వైఎస్ జగన్మోహన రెడ్డి:
1.నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.(మాటమీద నిలబడే తత్వం తండ్రి నుంచే సంక్రమించింది)
2. ప్రజలే దేవుళ్లు. ప్రజా సంక్షేమమే లక్ష్యం.
3.రుణ మాఫీ సాధ్యం కాదని తెలిసి పార్టీలో కొందరు నేతలు హామీ ఇవ్వమని చెప్పినా హామీ ఇవ్వలేదు.
4.అధికారం కంటే ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రధాన్యత ఇచ్చారు.
5.రాజకీయ అనుభవం లేకపోయినా నిజాయితీగా వ్యవహరించారు.
6.అమలు కాని హామీలు ఇవ్వలేదు.
7. పరిపాలన, వనరులకు సంబంధించి అన్ని అంశాలలో స్పష్టత ఉంది.
8.రైతులను మోసం చేయడం ఇష్టంలేదు.
9. మహిళలను మోసం చేయడం ఇష్టంలేక అమ్మ ఒడి వంటి ఆచరణ సాధ్యం అయ్యే హామీలనే ఇచ్చారు.
10. ప్రజలతోనే పొత్తు ముఖ్యం అని ఒంటరిగానే పోటీ చేశారు.
- ఎస్ఎన్ఆర్
Share this article :

0 comments: