ఆ గ్రామాల్లో ఎవరి కంట చూసినా కన్నీటి ధారలే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ గ్రామాల్లో ఎవరి కంట చూసినా కన్నీటి ధారలే

ఆ గ్రామాల్లో ఎవరి కంట చూసినా కన్నీటి ధారలే

Written By news on Friday, July 18, 2014 | 7/18/2014

 ఆ గ్రామాల్లో ఎవరి కంట చూసినా కన్నీటి ధారలే కనిపించాయి. కష్టాల బతుకులే తారస పడ్డాయి.బతుకు తెరువు కోసం వలస వెళ్లి  చెన్నైలో ఇటీవల జరిగిన రెండు ఘోర ప్రమాదాల్లో తమవారిని పోగొట్టుకున్న కుటుంబాలు విషణ్ణవదనంలో మునిగిపోయూయి. ఆయూ కుటుంబాను వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఓదార్చారు. ప్రమాద వివరాలు, ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. కష్టాల జీవనం తెలుసుకుని తల్లడిల్లారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూసేందుకు పార్టీ ప్రతినిధుల బృందాన్ని చెన్నై పంపిస్తాన ంటూ భరోసా ఇచ్చారు.

 టీఆర్ రాజుపేటలో  కొయ్యాన జయమ్మ కుటుంబ సభ్యులతో...
 జగన్: మృతురాలు జయమ్మ కుమార్తె బొట్ట రామకుమారిని ఓదార్చారు. ప్రమాద తీరుపై ప్రశ్నించారు.
 అక్కడే ఉన్న రామకుమారి భర్త శ్రీనివాసరావు కలుగజేసుకుని జయమ్మ అల్లుడ్ని నేను. ముగ్గురు పిల్లలు నాకు. మేము ప్రమాదాన్ని చూడలేదు. మా అత్త తిలువులూరుజిల్లా యదపాలెంలో పనిచేస్తుండగా, మేము 20 కిలోమీటర్ల దూరంలోని చెన్నైసిటీలోని రెడ్ ఏరియా మాధవరం బ్రిడ్జి వద్ద పనిచేస్తున్నాం.

 జగన్:  ప్రమాదవార్త మీకెలా తెలిసింది.
 శ్రీనివాసరావు: మా అత్త తలవద్ద ఉన్న బ్యాగ్‌లో ఒక పుస్తకం తమిళనాడు పోలీసులకు దొరికింది. అందులోని బూర్జ మండలంలోని లక్కుపురం గ్రామంలో ఉన్న మా చెల్లి ఫోన్ నంబర్‌కు కాల్‌చే శారు. మా చెల్లి నాకు ఫోన్ చేసి చెప్పడం తో వెంటనే నేను అక్కడకు వెళ్లాను.

 జగన్: మీరు వెళ్లేసరికి మృతదేహాలు అక్కడే ఉన్నాయా?
 శ్రీనివాసరావు: లేవు. ఆస్పత్రిలో ఉన్నాయని చెప్పారు. అక్కడకు వెళ్లి చూశాను. మా అత్తతో పాటు కోటబొమ్మాళి మండలంలోని చుట్టిగుండం గ్రామానికి చెందిన చిన్నత్త, చిన్నమామ, వారి కుమారుడు శవాలే కనిపించారుు. వీటిని చూసి అక్కడే కుమిలిపోయూను.

 జగన్: ఆ గోడ ఎలా కూలిపోయింది.
 శ్రీనివాసరావు: ఆ గోడ పాతదే. గోడ కలి సొస్తాదని దానికి ఆనుకొని పాక వేశారు. వర్షానికి అది కూలిపోరుుంది.

 జగన్: ఓనురుపై కేసు పెట్టండి
 శ్రీనివాసరావు: అలాగే బాబూ..

 జగన్: మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. మీకు మన బొబ్బిలి రాజు, ఎమ్మెల్యే సృజయకృష్ణ రంగారావుతో మాట్లాడించి మంచి లాయర్‌ను ఏర్పాటు చేసి మీ ఆవేదన వినిపించేలా చేస్తాను. జరిగినది జరిగినట్టుగా వివరాలు చెప్పండి, ఎల్లుండి మా పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతిలు  మీతో మాట్లాడతారు.
 జగన్: శ్రీనివాసరావు పిల్లల పేర్లు తెలుసుకుని ఆప్యాయంగా పలకరించారు. వారి చదువులపై ఆరా తీశారు. బాగా చదువుకోవాలంటూ దీవించారు.

 కొల్లివలసలో కర్రి సింహాచలం కుటుంబ సభ్యులతో...
   జగన్: ప్రమాదం ఎలా జరిగిందమ్మా? చెన్నై ఎప్పుడు వెళ్లారు?
 సింహాచలం భార్య రాజులమ్మ: పిల్లలకు వేసవిసెలవులు ఇచ్చినప్పుడు అందరమూ కలసి చెన్నై వెళ్లిపోనాం. తిరిగిబడులు పెడతారని అందరూ కలసి మా ఊరు వచ్చాం.  మా పెద్దోడిని తోటాడ బడిలో వేసి గత నెల 18న నా భర్త చెన్నై వెళ్లారు. ప్రమాదంలో చనిపోయూరు.

 జగన్: మీ గ్రామం నుంచి ఎంత మంది వలస వెళ్లారు?
 -మృతుడు సింహాచలం చిన్నాన్న కర్రి పెంటయ్య కల్పించుకొని వంద మంది వరకు వెళ్లినారు బాబు... వేర్వేరు చోట్ల పనిచేస్తున్నారు. సింహాచలం మేస్త్రీగా పనిచేస్తున్నారు.

 జగన్: కూలి ఎంత ఇచ్చేవారు?
 రాజులమ్మ : కూలీలకు రూ. 200, మేస్త్రీకి రూ. 500 ఇచ్చేవారు.

 జగన్: గోడ ఎలా కూలిపోయింది?
 రాజులమ్మ: వర్షం గట్టిగా కురవడంతో గోడ కూలిపోరుుందట. ముందురోజు రాత్రి ఎనిమిది గంటలకు నా భర్తతో ఫోన్‌లో మాట్లాడాను. మన ఊరిలో వర్షాలు కురిస్తే స్వగ్రామానికే వచ్చేస్తానని చెప్పి కనిపించని లోకాలకు వెళ్లిపోయూరంటూ భోరున విలపించింది.

 జగన్: తమిళనాడు ప్రభుత్వం మీకు సాయమందించిందా?
 భార్య: ఈ రోజే చెక్కులు ఇస్తామని శ్రీకాకుళం రమ్మని కబురెట్టారు. మీరు వస్తారని మేము వెళ్లకుండా ఉండిపోయినాం. నా మరిదిని శ్రీకాకుళం పంపినాను.

 పాలకొండలో ఊళ్ల రవి కుటుంబ సభ్యులతో...
 జగన్: రవి ఆకస్మికంగా చనిపోవడం చాలా బాధగా ఉందమ్మా..
 రవి తల్లి పార్వతి: పుట్టెడు శోకంలో ఉన్నాం బాబు. రవిపైనే కుటుంబమంతా ఆధారపడి ఉంది. ఇంటిలో అందరివీ కూలి బతుకులే. దూరం వెళ్లి డబ్బు పంపుతున్న చెట్టంత కొడుకు ప్రమాదంలో మృతిచెందాడంటూ భోరున విలపించింది. (ఆమెను జగన్ ఓదార్చారు)
 రవి తమ్ముడు చిన్నారావు: రవితో పాటు నేను కూడా పనిలోకి వెళ్లా. పక్కనే పనిచేస్తున్నా. హఠాత్తుగా బిల్డింగ్ కూలి రవి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరూ అక్కడ లేరు. సాయం లేదు. పోస్టుమార్టంలో వేరొకరి మృతదేహం అప్పజెప్పే ప్రయత్నం చేశారు. పాలకొండ ఆర్డీవో సాయంతో రవి మృతదేహాన్ని గుర్తించి తెచ్చుకోగలిగాం.

 జగన్: బిల్డర్‌పై కేసు వేద్దాం... అప్పుడు అతడే దారిలోకి వస్తాడు. లేకపోతే చట్టపరంగా పరిహారం కోసం పోరాడతాం. బిల్డర్‌ను విడిచిపెట్టేది లేదు. భయపడకండి. ప్రస్తుతం జీవనం ఎలా?
 రవి అన్న శ్రీను, చిన్నాన్న సూర్యనారాయణ:  కొంత సొంత భూమి ఉంది. కొంత కౌలుకు తీసుకొని పండిస్తున్నాం. నాలుగేళ్ల నుంచి పంటలు లేవు. బతుకు బాగోలేదు. అందుకే తమ్ముడు రవి వలస వెళ్లాడు. సగంలో నిలిచిపోయిన ఇంటిని పూర్తి చేయడానికి డబ్బులు సంపాదించేందుకు వెళ్లాడు. పెళ్లి కూడా చేయాలనుకున్నాం. ఇంతలోగా ఘోరం జరిగిపోయింది. జగన్నాథరథాయాత్రకు వస్తానని చెప్పిన మని షి కనిపించని లోకాలకు వెళ్లిపోయాడు.

 జగన్: మీకు వైఎస్సార్ సీపీ తరఫున అండగా ఉంటాం. ఎమ్మెల్యేలు కళావతమ్మ, కలమట వెంకటరమణ, బొబ్బిలి రాజులు మీకు సాయమందిస్తారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ గతంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శిగా పనిచేశారు. వీరందరినీ ఒక బృందంగా ఏర్పాటు చేసి బిల్డర్ నుంచి పరిహారం రప్పిస్తాం.

 ఎల్‌ఎన్.పేటలో తాన్ని అప్పలనరసమ్మ కుటుంబీకులను ఓదార్చుతూ..
 జగన్: ప్రమాదం ఎలా జరిగింది?
 లక్ష్మీనారాయణ (మృతురాలు అప్పలనరసమ్మ భర్త): అప్పుడు నేను మరో దగ్గర పనికి వెళ్తున్నాను. నా భార్య మాత్రం వంట కోసం బియ్యం తేవడానికి ఆ భవనానికి వెళ్లింది. అంతే.. ఒక్కసారిగా భవనమంతా కూలిపోయింది. ఇంటి దీపం ఆరిపోరుుంది.

 జగన్: ఎంత మంది ఉంటున్నారు ఇక్కడ?
 లక్ష్మీనారాయణ: నేను, నా భార్య పనిలోకి వెళ్తే, పిల్లలు ఇద్దరినీ మా పెద్దోళ్లు చూసుకుంటున్నారు. ఏటా పనిలోకి వెళ్తేనే మాకు, మా పిల్లలకు కాసింత కూడు దొరికేది.

 జగన్: ఎంతిస్తారు..అక్కడ?
 లక్ష్మీనారాయణ: ఇద్దరికీ రూ.350 చొప్పున ఇచ్చేవారు. పని మాత్రం దొరికేది. ఒక కూలి ఖర్చుకు సరిపోయేది. మరో కూలి డబ్బులు దాచుకుని ఇక్కడికి వచ్చేవాళ్లం.

 జగన్: బిల్డింగ్ వారు ఏమైనా పరిహారం కింద డబ్బులు ఇచ్చారా.. కనీసం మాట్లాడారా?
 లక్ష్మీనారాయణ: అసలు ఎవరో తెలియదు. ఇంతవరకు ఏమీ ఈయలేదు.

 జగన్: భవనం యజమాని నుంచి పరిహారం అందేలా వైఎస్సార్ సీపీ ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు బొబ్బిలి రాజు సుజయ్, రాజన్నదొర, శ్రీదేవమ్మ (కురుపాం ఎమ్మెల్యే)లతో ప్రత్యేక కమిటీ వేసి అక్కడికి పంపిస్తాను. మీ కోసం పోరాడేలా చేస్తాను. ధైర్యంగా ఉండండి..

 జగన్: ఏమ్మా..ఏం చదువుతున్నారు..
 మృతురాలు పెద్దమ్మాయి రమాదేవి: నేను ఇక్కడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. మా  చెల్లి మాధవి 3వ తరగతి చదువుతోంది.

 జగన్: ఏమ్మా.. మీ స్కూల్‌లో మరుగుదొడ్లు, ఫ్యాన్లు ఉన్నాయా..

 రమా: ఏమీ లేవు సార్..
 జగన్: (పక్కనే ఉన్న రెడ్డి శాంతితో) అమ్మా శాంతి.. చూడమ్మా..అమ్మాయి 8వ తరగతి చదువుతోంది.

 అక్కడ బాత్‌రూమ్స్ లేవట..ఏదోలా కట్టేలా చెయ్..ట్రస్టులతో మాట్లాడు. నారాయణ అన్నా భార్యను కోల్పోవడం దారుణం.. ధైర్యంగా ఉండు .పిల్లల్ని పెద్ద చెయ్.. ఎప్పుడూ పనుల్లోకి పంపకు.. పిల్లలూ బాగా చదవండి.. ఉంటాను.

 గొట్ట గ్రామ బాధితులతో...
 జగన్: అయ్యా మీకు పెద్ద కష్టం వచ్చి పడింది?
 సింహాచలం (జ్యోతి భర్త): అవునన్నా. పక్క బిల్డింగ్‌లో పనిచేస్తున్నాం. వర్షం పడుతుందని ఆరేసిన బట్టలు తీసేం దుకు వెళ్లిన నా భార్య జ్యోతి శిథిలాల్లో చిక్కుకుంది. మాకు ఇద్దరు పిల్లలు. కుమార్తె మౌనిక రెండో తరగతి చదువుతోంది. అబ్బాయి శ్రీను చేతిపిల్లాడు.

 జగన్: తమిళనాడు ప్రభుత్వం నుంచి  పరిహారం అందిందా?
 సింహాచలం: మొత్తం రూ.7,25,000 అందాయి. పిల్లల పేరున డిపాజిట్ చేశామన్నా.

 జగన్: మంచిది. పిల్లలను బాగా చది వించు. ఏకష్టమోచ్చినా నేను ఆదుకుంటా..
 కొంగరాపు శ్రీను తండ్రి రాములు: అయ్యా, మమ్మలను ఓదార్చేందుకు వచ్చావా.. చెన్నైలో నాకొడుకు భవనం కూలిన ఘటనలో చనిపోయాడు. మా కోడలు కూడా చావుబతుకుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భగవంతుడు మా ఇంటికి అన్యాయం చేశాడు నాయనా..

 జగన్: ఈ పిల్లలెవరు..?
 రాములు: చనిపోయిన మా శ్రీను పిల్లలు. బాబు పేరు సాయి, పాప పేరు సుస్మిత.
 జగన్:  వారిని జగన్ అక్కున చేర్చుకు న్నారు. బాగా చదువుకోవాలంటూ సూచించారు.

 అక్కడే ఉన్న మీసాల శ్రీను భార్య సావిత్రి మాట్లాడుతూ ఈ మధ్యనే చెన్నైలో పనులకు వెళ్లాం. ఇంతలో భవనం రూపంలో మృత్యువు మా ఇంటి పెద్దదిక్కును తీసుకుపోయిందంటూ భోరున విలపించింది.
Share this article :

0 comments: