విజయనగరం మున్సిపాలిటీ, టౌన్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళ, బుధవారాల్లో జిల్లాలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు తెలిపారు. ఇటీవల చెన్నైలో భవనం కూలిన ఘటనలో మృతి చెందిన 24 కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని చెప్పారు. సోమవా రం ఆ పార్టీ నాయకుడు కోలగట్ల నివాసంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో పెనుమత్స మాట్లాడారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి విమానంలో బ యలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటన్నర సమయంలో జిల్లా కేంద్రానికి చేరుకుంటారన్నారు.
అక్కడి నుంచి నేరుగా గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజే రు మండలం కోరపు కృష్ణాపురం గ్రామానికి వెళ్లి చెన్నై ఘటనలో మృతి చెందిన ఏడుగురు కుటుం బ సభ్యులను పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి బాడంగి చేరుకుని ఇదే ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని చెప్పారు. అక్కడి నుంచి బొబ్బిలి చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారన్నారు. బుధవారం సాలూరు నియోజకవర్గంలోని మక్కువ మండలానికి చెందిన తూరుమామిడి, పెద ఘైశిల గ్రామాల్లోని బాధిత కు టుంబాలను, అక్కడ నుంచి కురుపాం నియోజకవర్గ పరిధిలోని కొమరాడ మండలం దళాయిపేట, మాదలింగ గ్రామాల్లోని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని వివరించారు.
అక్కడి నుంచి జియ్యమ్మవలస మండలం నీలమాంబపురం చేరుకుని ఆ గ్రామంలోని ఐదు కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. అదే రోజు సాయంత్రం శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి ఆ జిల్లాకు చెందిన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శిస్తారన్నా రు. పార్టీ నాయకుడు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారిగా జిల్లా పర్యటనకు వస్తున్న జగన్‌మోహనర్‌రెడ్డికి స్థానిక వై జంక్షన్ వద్ద పార్టీ నాయకు లు, కార్యకర్తలు స్వాగతం పలుకుతారని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్, మాఫెడ్ డెరైక్టర్ కెవి సూర్యనారాయణరాజు, విజయనగరం మున్సిపల్ కౌన్సిలర్ ఎస్‌వివి రాజేష్, మజ్జి అప్పారావు బంగారునాయుడు, తదితరులు పాల్గొన్నారు.
కె. కృష్ణాపురం బాధితులను పరామర్శించనున్న జగన్
గజపతినగరం: దత్తిరాజేరు మండలంలోని కె. కృష్ణాపురంగ్రామానికి చెందిన చెన్నై మృతుల కుటుంబాలను వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శించనున్నట్టు ఆపార్టీ నియోజ కవర్గ ఇన్‌చార్జ్ కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. సో మవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. చెన్నై ఘటనలో మృతి చెందిన ఏడు కుటుంబాలను జగన్ పరామర్శించి, ఓదార్చుతారని తెలిపారు.

0 comments:
Post a Comment