హామీలతో పాటు మాఫీలు చేయాల్సిందే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హామీలతో పాటు మాఫీలు చేయాల్సిందే

హామీలతో పాటు మాఫీలు చేయాల్సిందే

Written By news on Tuesday, July 22, 2014 | 7/22/2014

'హామీలతో పాటు మాఫీలు చేయాల్సిందే'
విజయవాడ: టీడీపీ ఎన్నికల హామీలతో పాటు ప్రభుత్వం అధికారికంగా చెప్పిన రుణమాఫీ, డ్వాక్రా, చేనేత రుణాలను మాఫీ చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్.నాగిరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందంటూ రూ.35 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామంటున్నారని అన్నారు. రైతులను మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలకు చెప్పినవన్నీ వైఎస్ఆర్,ఎన్టీఆర్‌ చేశారని గుర్తు చేశారు.

చంద్రబాబు పూటకోమాట మాట్లాడుతూ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో రైతులు వ్యవసాయ రుణాలు చెల్లించద్దు.. అధికారంలోకి రాగానే వాటిని మాఫీ చేస్తామంటూ హామీలు గుప్పించారని గుర్తు చేశారు. రైతు రుణమాఫీపైనే తొలి సంతకం చేస్తానంటూ రైతుల్ని, ప్రజల్ని నమ్మించారని విమర్శించారు. ఇప్పుడు రిటైర్డ్ బ్యాంకు అధికారులతో కూడిన కోటయ్య కమిటీని రుణమాఫీ కోసం వేసి తత్సారం చేస్తున్నరని ఆక్షేపించారు. రైతులకిచ్చిన హామీలను కేసీఆర్, చంద్రబాబు తీర్చాల్సిందేనని డిమాండ్ చేశారు.

Share this article :

0 comments: