‘దేశం’ దాడిలో వైఎస్సార్ సీపీ నేత మృతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘దేశం’ దాడిలో వైఎస్సార్ సీపీ నేత మృతి

‘దేశం’ దాడిలో వైఎస్సార్ సీపీ నేత మృతి

Written By news on Monday, July 28, 2014 | 7/28/2014

‘దేశం’ దాడిలో వైఎస్సార్ సీపీ నేత మృతి
  • పెద్దమోదుగపల్లిగ్రామంలో టీడీపీ నేతల అరాచకం
  •  మృతుడు మధుసూదనరావు మాజీ సర్పంచి
  •  వివాదం వద్దని సర్ది  చెబుతుండగా దాడి
వత్సవాయి : టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్ సీపీ నాయకుడు ఆదివారం మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దమోదుగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామ మాజీ సర్పంచి కల్యాణం మధుసూదనరావు(61)కు గ్రామ శివారున మామిడితోట ఉంది. అక్కడ ఆయన కుమారుడు విద్యాసాగర్ జేసీబీతో కాలువ తీయిస్తున్నాడు. తోట పక్కన నివాసం ఉంటున్న వారు కట్టెలను తీసి గట్టుపై ఉంచారు. జేసీబీకి అడ్డు వస్తున్నాయి.. వాటిని తీయాలని విద్యాసాగర్ చెప్పారు.

ఇది పోరంబోకు స్థలం తియ్యమని చెప్పడానికి నీవెవరు అంటూ అతడిపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న మధుసూదనరావు తోట దగ్గరకు వెళ్లగా, అప్పటికే వివాదం ముదిరింది. ఘర్షణ వద్దని మధుసూదనరావు సర్ది చెబుతుండగా, టీడీపీ నేతలై న గ్రామ ఉప సర్పంచి నందమూరి శ్రీను, రాము, కనగాల గణపతిలు దాడికి దిగారు. ఈ ఘటనలోమధుసూదనరావు అక్కడిక్కడే కుప్పకూలారు. గ్రామస్తులు ఆటోలో జగ్గయ్యపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
 
గ్రామస్తుల ఆందోళన
 
మధుసూదనరావు మృతికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ జగ్గయ్యపేట మున్సిపల్ కూడలిలో గ్రామస్తులు ఆందోళన చేశారు. నిందితుల్ని అరెస్టు చేస్తామని  సీఐ వీరయ్యగౌడ్ హామీతో  శాంతించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పేట ప్రభుత్వ వైద్యశాలలో ఉంచారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదనరావు మృతితో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా ముందస్తుగా పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
 
ఉదయభాను  పరామర్శ
 
తెలుగుదేశం నాయకుల దౌర్జన్యానికి బలైన గ్రామ మాజీ సర్పంచి మధుసూదనరావు మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, నియోజవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు కనపర్తి శేషగిరిరావు, మారెళ్ల పుల్లారెడ్డి, ఇంటూరి చిన్నా, మున్సిపల్ మాజీ  చైర్మన్ ఎంవీ చలం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నంబూరి రవి, చౌడవరపు జగదీష్ తదితరులు వసందర్శించి నివాళులర్పించారు. మధుసూదనరావు మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: