11 మందిని కిరాతకంగా చంపారు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 11 మందిని కిరాతకంగా చంపారు: వైఎస్ జగన్

11 మందిని కిరాతకంగా చంపారు: వైఎస్ జగన్

Written By news on Monday, August 18, 2014 | 8/18/2014

11 మందిని కిరాతకంగా చంపారు: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ :
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లో 11 మందిని అతి కిరాతకంగా చంపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ తిరిగి సమావేశమైన తర్వాత ఆయన మాట్లాడారు. 119 మంది తీవ్రంగా గాయపడ్డారని, జరుగుతున్న హత్యలు, దాడులపై ఎలాంటి చర్య తీసుకున్నారని అడిగితే, అసలు చర్య తీసుకునే పరిస్థితి లేదని, వాళ్ల కుటుంబ సభ్యులు ఎంత భయాందోళనలతో బతుకుతున్నారో మేం స్పష్టంగా కళ్లతో చూశామని అన్నారు.

అంతలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు కలగజేసుకుని మాట్లాడారు. శాంతిభద్రతల మీద మీరిచ్చిన వాయిదా తీర్మానం ముఖ్యం కాదనట్లేదు గానీ, దానికోసం ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. బిజినెస్ ఎలా సాగాలో మీరు చెప్పకూడదని, పద్ధతులు, సంప్రదాయాల ప్రకారం వెళ్లాలని అన్నారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

దీంతో 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు వెల్ లోకి వచ్చి పెద్దపెట్టున నినాదాలు చేశారు. వాళ్ల నిరసన మధ్యే ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడారు. కేవలం సభను అడ్డుకోవాలన్నదే ప్రతిపక్షం లక్ష్యంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కూడా వైఎస్ఆర్ సీపీ సభ్యులు తీవ్రస్థాయిలో 'వుయ్ వాంట్ జస్టిస్' నినాదాలు చేయడంతో స్పీకర్ కోడెల సభను 15 నిమిషాలు వాయిదా వేశారు.
Share this article :

0 comments: