బాబు పాలనకు 57 మార్కులైతే.. వైఎస్ పాలనకు 96 మార్కులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు పాలనకు 57 మార్కులైతే.. వైఎస్ పాలనకు 96 మార్కులు

బాబు పాలనకు 57 మార్కులైతే.. వైఎస్ పాలనకు 96 మార్కులు

Written By news on Tuesday, August 26, 2014 | 8/26/2014

జనానికి ఏం చెప్తారు?
హామీల అమలుకు బడ్జెట్‌లో నిధులేవీ?  ప్రభుత్వంపై విపక్ష నేత జగన్ ధ్వజం
 
‘‘రాష్ట్రంలో కోటిమంది రైతులు రుణ మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. 70 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలు రుణాలు రద్దవుతాయని ఆశపడుతున్నారు. రాష్ట్రంలో 1.5 కోట్ల ఇళ్లు ఉన్నాయి.. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవ్వలేకపోతే.. ప్రతి నెలా రూ. 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి కోసం యువత ఎదురు చూస్తోంది. పదో వేతన సవరణ సంఘం సిఫారసుల అమలు కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల హామీల అమలుకు బడ్జెట్‌లో నిధులు ఇవ్వలేదు. వాటి అమలు సాధ్యం కాదని, నెపాన్ని గత ప్రభుత్వాల మీద నెట్టాలని చూస్తున్నారు. ఫలితంగా కోట్లాది కుటుంబాల్లో నిరాశ నెలకొంది. అందుకే ఇది నిరాశను నింపే బడ్జెట్.. తప్పుదోవ పట్టించే బడ్జెట్...’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో టీడీపీ సర్కారు తీరు ఆడలేక మద్దెల ఓడు అన్న చందంగా ఉందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గత పాలనలో రెండు రూపాయలకు కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం తదితర ఎన్నికల హామీలకు అధికారంలోకి రాగానే తిలోదకాలు ఇచ్చినట్లు.. ఇప్పుడు కూడా రుణ మాఫీ, నిరుద్యోగ భృతి తదితర హామీలను తుంగలో తొక్కేస్తారని రాష్ట్ర ప్రజలు భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రుణ మాఫీ కోసం నిరీక్షిస్తున్న రైతులకు, మహిళలకు, నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్న యువతకు టీడీపీ సర్కారు ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో చర్చను ప్రారంభిస్తూ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులకు ఏమాత్రం పొంతన లేదని తూర్పారబట్టారు. సామాజిక పెన్షన్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తదితర సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను కూడా బడ్జెట్‌లో కేటాయించకపోవడంతో.. వాటి అమలులో కోతలు విధిస్తారన్నది స్పష్టమవుతోందని దుయ్యబట్టారు. అధికారపక్ష సభ్యులు పలు దఫాలు అడ్డుతగిలినప్పటికీ.. ఆయన గణాంకాలతో సహా విడమరిచి చెప్పారు. అభివృద్ది విషయంలో సర్కారు శ్వేతపత్రాల రూపంలో చేస్తున్న అసత్య, అర్ధసత్య ప్రచారాన్ని దునుమాడుతూ... గత పదేళ్లలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందని పేర్కొంటూ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) వృద్ధి రేటు, తలసరి ఆదాయం పెరిగిన తీరు, రెవెన్యూ మిగులు, జీఎస్‌డీపీలో అప్పుల శాతం, ఆస్తులు - అప్పుల నిష్పత్తి.. గణాంకాలను సభ ముందు ఉంచారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే...
 
బాబు పాలనకు 57 మార్కులైతే.. వైఎస్ పాలనకు 96 మార్కులు

ఏ రాష్ట్రంలోనైనా పాలన ఎలా ఉంది, అభివృద్ధి తీరు ఎలా ఉందో చెప్పడానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం, రెవెన్యూ లోటు, మిగులు, మొత్తం వ్యయంలో ప్రణాళిక వ్యయం వాటా, జీఎస్‌డీపీలో అప్పుల నిష్పత్తి, ఆస్తులు - అప్పుల నిష్పత్తి గణాంకాలు, ఆర్థిక నిర్వహణ తీరు, మానవాభివృద్ధి సూచీ, ఆర్థిక స్వేచ్ఛ సూచీ.. ఇవే ఆధారం. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలన అయినా.. ఎలా ఉందో చెప్పడానికైనా ఈ అంశాలే గీటురాయి. ఈ ప్రమాణాలు, సూచీల ప్రకారం చూస్తే.. 2004 నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి రాష్ట్రం పుట్టినప్పటి నుంచి జరగలేదని స్పష్టమవుతోంది. జీఎస్‌డీపీలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు ఇమిడి ఉంటాయి. చంద్రబాబు నాటి హయాంతో పాటు అంతకు ముందు పదేళ్లు, తర్వాత 10 సంవత్సరాల్లో జీఎస్‌డీపీ వృద్ధిరేటును చూస్తే అభివృద్ధి తీరు అర్థమవుతుంది. జీఎస్‌డీపీ వృద్ధి రేటును సాధారణ పరిభాషలో చెప్తే.. చంద్రబాబు నాటి హయానికి ముందు పది సంవత్సరాల్లో (1984-94 కాలంలో) 53 మార్కులు వస్తే, చంద్రబాబుకు (1994-2004 కాలంలో) 57 మార్కులు, వై.ఎస్.రాజశేఖరరెడ్డికి (2004 నుంచి 2009 వరకు) 96 మార్కులు, తర్వాత ప్రభుత్వాలకు (2009 నుంచి 2014 వరకు) 68 మార్కులు వచ్చాయి.
 
తలసరి ఆదాయం చంద్రబాబు హయాంలో రూ. 15,502 నుంచి రూ. 23,448కి పెరిగింది. అంటే పెరుగుదల రూ. 7,946. వైఎస్ హయాంలో తలసరి ఆదాయం రూ. 23,448 నుంచి రూ. 46,345కు పెరిగింది. అంటే రూ. 22,897 పెరిగింది.ఆర్థిక నిర్వహణ కూడా గత పదేళ్లలో బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్న పదేళ్లలో రెవెన్యూ లోటు రూ. 21,994 కోట్లు ఉండగా, తర్వాత రెండేళ్లలోనే వై.ఎస్.రాజశేఖరరెడ్డి లోటును పూడ్చారు. 2004 నుంచి 2014 వరకు రూ. 10,329 కోట్ల మిగులు సాధించారు.

 ఆస్తులు - అప్పుల నిష్పత్తి చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టే నాటికి ప్రతి రూ. 100 అప్పుకు రూ. 101 విలువైన ఆస్తులు ఉండేవి. తర్వాత అప్పులు బాగా పెరగడంతో.. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరు బడ్జెట్ నాటకి (2004లో) ప్రతి రూ. 100 అప్పుకు రూ. 44 విలువైన ఆస్తులే ఉన్నాయి. వైఎస్ హయాంలో ఆస్తుల విలువ రూ. 139 పెరిగింది. 2004-14 మధ్య చూసినా.. ఆస్తులు - అప్పుల నిష్పత్తి 103:100గా ఉంది.

చంద్రబాబు పాలనలో అప్పుల భారం పెరిగింది. చంద్రబాబు అధికారం చేపట్టిన 1995లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 20.5 శాతం ఉండగా.. జీఎస్‌డీపీలో వృద్ధి రేటు తగ్గడం, అప్పుల భారం పెరగడం వల్ల ఆయన దిగిపోయే సమయానికి 32.4 శాతానికి అప్పుల భారం పెరిగింది.  వైఎస్ హయాంలో అది 28.5 శాతానికి తగ్గింది.ఆర్థిక స్వేచ్ఛ సూచీలో 2005లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉండగా, 2009లో వైఎస్ హయాంలో సూచీ మెరుగుపడి రాష్ట్రం 3వ స్థానానికి పెరిగింది.

మానవాభివృద్ధి సూచీలో మన రాష్ట్రం గత పదేళ్లలో 15వ స్థానానికి పడిపోయిందని ఆర్థికమంత్రి యనమల చెప్పిన విషయంలో వాస్తవం లేదు. 1991, 2001లో 15 రాష్ట్రాలకే మానవాభివృద్ధి సూచీ తయారు చేయగా ఏపీకి 9, 10 స్థానాలు వచ్చాయి. తర్వాత 28 రాష్ట్రాలకు చేసినప్పుడు 1999లో 15 స్థానంలో నిలిచింది. 2007-08 లోనూ అదే స్థానాన్ని కొనసాగించింది. గత పదేళ్లలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటే.. గవర్నర్ ప్రసంగం, ప్రభుత్వ శ్వేతపత్రాలు, బడ్జెట్ ప్రసంగం.. అన్నిట్లోనూ గత పదేళ్లలో రాష్ట్రం నాశనం అయిపోయినట్లు అసత్యాలు చెప్పారు.
 
 ఆ ‘విత్తనాలకు మొలకలు’ వచ్చింది వైఎస్ దక్షతతోనే...

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద జరిగిన చర్చకు చంద్రబాబు సమాధానం ఇస్తూ.. విత్తనం, మొలక సిద్ధాంతం చెప్పారు. తాను వేసిన అభివృద్ధి విత్తనాల వల్లే తర్వాత వైఎస్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నారు. చంద్రబాబు 9 సంవత్సరాల్లో ఒక్క విత్తనమూ మొలక రాలేదు. కానీ వైఎస్ హయాంలో విత్తనాలన్నీ విపరీతంగా మొలకలు వచ్చాయి. ఎన్‌టీఆర్ వేసిన విత్తనాలు కూడా చంద్రబాబు హయాంలో మొలక రాలేదు. అవి కూడా వైఎస్ హయాంలోనే మొలకలు వచ్చాయి. పాలన ఒక దక్షత. యథా రాజా తథా ప్రజ అని దేవుడు ఆశీర్వదిస్తాడు.
 
 వాస్తవానికి దూరంగా బడ్జెట్ గణాంకాలు

బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలనూ మార్చకుండా కొత్త బడ్జెట్‌లో ‘కట్ అండ్ పేస్ట్’ చేశారు. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ అంచనాలను సవరించకపోతే.. పరిస్థితి మొత్తం అగమ్యగోచరంగా మారిపోతుంది. తప్పుడు గణాంకాల వల్ల అంచనాలు తప్పే ప్రమాదం ఉంది. కేంద్రం నుంచి వచ్చే ‘గ్రాంట్స్ ఇన్ ఎయిడ్’ 2012-13 ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా రూ. 7,680 కోట్లు ఉండగా, ఈ ఏడాది రూ. 28,830 కోట్లుగా బడ్జెట్‌లో పేర్కొన్నారు. కేంద్రం నుంచి అన్ని నిధులు వస్తే మంచిదే. కానీ పరిస్థితిని సరిగా అంచనా వేయాలి  {V>…s్‌‌స ఇన్ ఎయిడ్ కంటే ప్రణాళికా వ్యయం తక్కువగా ఉండటం గమనార్హం. సాధారణంగా మొత్తం వ్యయం (బడ్జెట్ పరిమాణం)లో ప్రణాళికా వ్యయం 34-35 శాతం ఉంటుంది. కానీ ప్రస్తుత బడ్జెట్లో 23 శాతమే ఉంది.
     
పెట్టుబడుల వ్యయం (కేపిటల్ ఎక్స్‌పెండిచర్) శాతం కూడా గణనీయంగా తగ్గింది. ఫలితంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి తగ్గే ప్రమాదం పొంచి ఉంది. ఘనంగా గణాంకాలు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. తప్పుదోవ పట్టించడానికి తప్ప తప్పుడు గణాంకాలు దేనికీ ఉపయోగపడవు. అందుకే.. ఇది తప్పుదోవ పట్టించే బడ్జెట్ అని చెప్తున్నా.
 
 పూర్తి అవగాహనతోనే హామీలు ఇచ్చామన్నారు...

రాష్ట్ర ప్రభుత్వం వనరులు ఏమిటి? విభజన తర్వాత వచ్చే ఇబ్బందులు ఏమిటి? అనే విషయాలు అందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జూన్‌లో జరిగిన 181 రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో వ్యవసాయ రుణాలు రూ. 1.25 లక్షల కోట్లు ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక అందరికీ అందుబాటులో ఉంది. విభజన బిల్లు మీద అసెంబ్లీలో చర్చ జరిగింది. రాష్ట్రాల ఆవిర్భావ దినం జూన్ 2 అని మార్చి 14న కేంద్రం ప్రకటించింది. అదే నెల 31న టీడీపీ రెండు మేనిఫెస్టోలు విడుదల చేసింది. రైతు రుణ మాఫీ, డ్వాక్రా మహిళల రుణాల రద్దు, ఇంటింటికీ నిరుద్యోగ భృతి ఇస్తామని ఆ మేనిఫెస్టోల్లో చెప్పారు. వనరుల లభ్యత మీద పూర్తి అవగాహన ఉందని, ఆ మేరకు హామీలు ఇచ్చానని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో చంద్రబాబు చెప్పారు. హామీల గురించి చంద్రబాబు సంతకం చేసిన కరపత్రాలను ఇంటింటికి పంచారు. ఇప్పుడేమో వాటి అమలు సాధ్యం కాదని నెపాన్ని గత ప్రభుత్వాల మీద నెట్టాలని చూస్తున్నారు. ఫలితంగా కోట్లాది కుటుంబాల్లో నిరాశ నెలకొంది. అందుకే దీన్ని నిరాశను నింపే బడ్జెట్ అంటున్నాం.
 
రైతు రుణ మాఫీకి ఎన్ని పరిమితులో..!

వ్యవసాయ రుణాలు రూ. 87,612 కోట్లు, స్వయం సహాయక బృందాల రుణాలు రూ. 14,204 కోట్లని ఈ ఏడాది జూన్ 30న జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్యాంకర్లు నివేదించారు. రుణాలు రద్దవుతాయని రైతులు రుణాలు చెల్లించలేదని, ఫలితంగా ‘వడ్డీ లేని రుణం’ (సున్నా శాతం వడ్డీ) అర్హతను రైతులు కోల్పోయారని, రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి పంటల బీమా లేకుండా రైతులు సాగు మొదలు పెట్టారని బ్యాంకులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సమాచారం కావాలని కోరితే రెండు మూడు రోజుల్లో సమగ్ర సమాచారం వస్తుంది. కానీ సమగ్ర సమాచారం లేదని కొంత కాలం జాప్యం చేశారు. ఎట్టకేలకు ఇచ్చిన మార్గదర్శకాల జీవో 174లో ఎన్నో పరిమితులు పెట్టారు. అన్ని రుణాలు, వడ్డీతో కలిపి కుటుంబానికి రూ. 1.5 లక్షలు మాత్రమే మాఫీ అని రాశారు. డ్వాక్రా రుణాల రద్దు హామీని మరిచి.. సరికొత్త పెట్టుబడి రూ. లక్ష అందిస్తామని కొత్త పాట ఎత్తుకున్నారు. ఈ ఏడాది మార్చి 31 వరకు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్వయంగా వెల్లడించారు. కానీ 2013 డిసెంబర్ ఆఖరు వరకు తీసుకున్న రుణాలకే రద్దు వర్తిస్తుందని తాజా జీవోలో పేర్కొన్నారు.

మహిళలతో చేతులెత్తించి మరీ చెప్పారు...


ఎన్నికలప్పుడు టీవీల్లో వచ్చిన ప్రకటన గుర్తు చేస్తా. తనఖాకు మంగళసూత్రం తీసుకెళుతున్న మహిళలకు.. ‘బాబు వస్తారు.. బంగారం విడిపిస్తారు’ అని ఆ ప్రకటనలో చెప్తారు. బహిరంగ సభల్లో.. ‘బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న మహిళలు చేతులెత్తండి’ అని చంద్రబాబు అడుగుతారు. పెద్ద సంఖ్యలో మహిళలు చేతులు ఎత్తుతారు. ‘బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తా’నని చంద్రబాబు గట్టిగా చెప్తారు. ఎన్నికల సభల్లో చాలా చోట్ల ఇదే చెప్పారు. ఇప్పుడేమో మాటమారుస్తున్నారు. డ్వాక్రా మహిళల పరిస్థితి ఘోరంగా ఉంది. వారి ఖాతాల్లో ఉన్న సొమ్మును బ్యాంకులు రుణాలకు జమ వేసుకుంటున్నాయి.

బ్యాంకులు నోటీసులిస్తున్నాయి


రైతులు రుణాలు చెల్లించాలని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయి. నోటీసు అందిన 15 రోజుల్లోగా రుణాలు చెల్లించకపోతే.. తనఖాలో ఉన్న బంగారం వేలం వేస్తామంటున్నాయి.  ‘నోటీసు అందిన 15 రోజుల్లో రుణం, వడ్డీ చెల్లించాలి. లేదంటే.. పత్రికా ప్రకటన ఇవ్వడానికి అయిన ఖర్చు, వేలం నిర్వహణకు అయ్యే ఖర్చునూ కలిపి వేలంలో వచ్చిన సొమ్మును మినహాయించుకుంటాం’ అని నోటీసులో ఉంది.

 ఉద్యోగులకు పీఆర్‌సీ ఎప్పుడు?


 బడ్జెట్‌లో పదో పీఆర్‌సీ ప్రస్తావన ఎక్కడా లేదు. ధరలు మండుతున్నాయి. సగటు ఉద్యోగి బతుకు భారమవుతోంది. గత ఏడాది (2013) జూలై నుంచే పదో పీఆర్‌సీ అమలు కావాల్సి ఉన్నా.. సంవత్సరం తర్వాత కూడా కొత్త పీఆర్‌సీ ఎప్పుడు వస్తుందోనని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త వేతనాలు అందుతాయని, కొత్త రాష్ట్రం తొలి బడ్జెట్‌లో పీఆర్‌సీ అమలుకు నిధులు కేటాయిస్తారని ఎదురు చూసిన ఉద్యోగులకు తీవ్ర నిరాశ మిగిలింది. పీఆర్‌సీ నివేదిక ప్రభుత్వానికి అంది రెండు నెలలు దాటింది. ఇప్పటికీ నివేదికనే బయటపెట్టలేదు. వెంటనే నివేదిక బహిర్గతం చేసి.. ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలి. వీలయినంత త్వరగా పీఆర్‌సీని అమలు చేసి 4 లక్షల మంది ఉద్యోగులను, వారి కుటుంబాలను ఆదుకోవాలి. పెన్షనర్ల పరిస్థితి మరీ ఘోరం. జీవిత మలిసంధ్యలో ధరాభారాన్ని మోయలేక రాష్ట్రంలోని 3.58 లక్షల మంది పెన్షనర్లు సతమతమవుతున్నారు. కొత్త పీఆర్‌సీ అమలు చేస్తే వారికి.. మండుతున్న ధరల నుంచి కాస్తంత ఉపశమనం కలుగుతుంది.
 
సామాజిక పెన్షన్లకు నిధులివ్వలేదు

రాష్ట్రంలో 43 లక్షల మంది సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు. ప్రస్తుతం నెలకు రూ. 130 కోట్లు పింఛన్ల కోసం అవసరం. పింఛను మొత్తాన్ని రూ. 200 నుంచి రూ. 1000 పెంచితే ప్రతి నెలా రూ. 450 కోట్లు కావాలి. పాత బకాయిలు, పెంచిన మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పింఛన్లు చెల్లించడానికి రూ. 3,730 కోట్లు అవసరం. కానీ రూ. 1,338 కోట్లే ఇచ్చారు. అరకొర నిధులతో పింఛన్లు ఎలా ఇస్తారు?

ఉచిత విద్యుత్‌కు నిధులేవి?


వ్యవసాయానికి 5 హెచ్‌పీ మోటార్ 7 గంటలు వాడితే 26.25 యూనిట్ల విద్యుత్ అవసరం. ఏడాదికి 300 రోజులు మోటారు నడుస్తుందని అంచనా వేస్తే.. 7,875 యూనిట్లు విద్యుత్ కావాలి. రాష్ట్రంలో 14.5 లక్షల మోటార్లున్నాయి. వీటికి 1,145 కోట్ల యూనిట్ల విద్యుత్ అవసరం. యూనిట్‌కు కనీసం రూ. 4 సబ్సిడీ లెక్కగట్టినా.. రూ. 4,580 కోట్లు కావాలి. కానీ కేటాయించింది రూ. 3,188 కోట్లే. మరి ఉచిత విద్యుత్ కొనసాగిస్తారా? లేక మధ్యలో మాట తప్పుతారా? అనే అనుమానం ప్రజలకు ఉంది.’’
 
 ఆఖరు దశలో ఉన్న ప్రాజెక్టుల మీదైనా దృష్టి పెట్టాలి...

జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఇప్పటి వరకు 19.696 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని, మరో 3.036 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని 2013-14 సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది.   13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో జలయజ్ఞం కింద 52.05 లక్షల ఎకరాలను ఆయకట్టు కిందకు తీసుకురావడం, 21.18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా 54 ప్రాజెక్టుల (26 మేజర్, 18 మీడియం, 4 ఫ్లడ్ బ్యాంక్స్, 6 ప్రాజెక్టుల ఆధునీకరణ)ను చేపట్టారు. ఇప్పటివరకు 13 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 14 ప్రాజెక్టులు పాక్షికంగా వినియోగంలోకి వచ్చాయి. జలయజ్ఞం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 19.696 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీటి వసతి కల్పించారు. 3.036 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు.

పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మినహాయిస్తే.. మరో 39 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 17,368 కోట్లు అవసరమని సాగునీటి శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. చాలా ప్రాజెక్టుల పనులు 70 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయడం మీద దృష్టి పెడితే ప్రజలకు మేలు జరుగుతుంది. రూ. 4,500 కోట్ల ఖర్చుతో ఆఖరు దశలో ఉన్న 9 ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చు. ఫలితంగా 15 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. కానీ ప్రభుత్వం రూ. 310 కోట్లే బడ్జెట్‌లో కేటాయించింది. ఏఐబీపీ ప్రాజెక్టుల మీద దృష్టి పెడితే మూడింట రెండొంతుల సాయం కేంద్రం నుంచి అందుతుంది. ఫలితంగా తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది.
 
శ్వేతపత్రాలన్నీ అసత్యాలు, అర్ధసత్యాలే...http://img.sakshi.net/images/cms/2014-08/71408996156_Unknown.jpg
 
శ్వేతపత్రాల్లో అసత్యాలు, అర్ధసత్యాలతో నింపేశారు. వైఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు, ఆర్‌టీసీ చార్జీలు, మునిసిపల్ పన్నులు, నీటి తీరువా, వ్యాట్ పెంచలేదు. ప్రజల మీద అదనంగా ఒక్క పైసా కూడా భారం వేయలేదు. కానీ ఈ విషయాన్ని ఏ శ్వేతపత్రంలోనూ ప్రభుత్వం కనీస ప్రస్తావన కూడా చేయలేదు.1999-2004 మధ్య విద్యుత్ చార్జీలు కేవలం 30 శాతమే పెంచారని విద్యుత్‌పై విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్నారు. 1994-1999 వరకు మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే మరిచిపోయారు.విద్యుత్ లోటు గురించీ అలాగే చెప్పారు. విద్యుత్ సరఫరా రంగంలో చంద్రబాబు హయాంలో సరాసరి వార్షిక వృద్ధి రేటు 4.05 శాతం కాగా, వైఎస్ హయాంలో 11.41 శాతం. 2004-14 మధ్య చూసినా.. సరాసరి వార్షిక వృద్ధి రేటు 9.09 శాతం ఉంది.

చంద్రబాబు తన 9 సంవత్సరాల పాలనలో ఒక్కో హార్స్‌పవర్‌కు రూ. 625 చొప్పున రైతులకు 800 కోట్ల యూనిట్ల విద్యుత్ సరఫరా చేశారు. కానీ వైఎస్ తన హయాంలో 1,500 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను రైతులకు ఉచితంగా ఇచ్చారనే మాటనూ ఎక్కడా రాయలేదు.ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) వైఎస్ హయాంలో తక్కువగా ఉందని శ్వేతపత్రంలో నిస్సిగ్గుగా రాశారు. 2003-04లో 86 శాతం ఉండగా, 2009-10లో 86.6 శాతం నమోదయిందని పవర్ డెవలెప్‌మెంట్ స్టాటిస్టిక్స్ అధికారిక పత్రంలో పేర్కొంది.వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసినవన్నీ తప్పులని, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం చేసినవన్నీ గొప్పలని శ్వేతపత్రాల్లో రాసుకోవడం విడ్డూరంగా ఉంది. ఐఎంజీకి, గంగవరం, కృష్ణపట్నం పోర్టులు, జీఎంఆర్ విమానాశ్రయానికీ భూములివ్వడం కూడా తప్పుకాదనే విధంగా ప్రభుత్వ తీరు ఉంది.
 
 
బాబు గత చరిత్ర చూసి  జనం భయపడుతున్నారు... http://img.sakshi.net/images/cms/2014-08/61408996250_Unknown.jpg
 
ఎన్నికలప్పుడు హామీలు గుప్పించడం, తర్వాత మాట తప్పడం చంద్రబాబుకు అలవాటే. 1994 ఎన్నికల్లో ఇచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం హామీ, సంపూర్ణ మద్య నిషేధం హామీ, రూ. 50కే ఒక హార్స్‌పవర్ వ్యవసాయ విద్యుత్ హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచారు. రూ. 2 కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధం పథకాలు భారమయ్యాయంటూ పెద్ద ఎత్తున పన్నులు, చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ విద్యుత్ చార్జీలూ పెంచారు. బాధతో ఈ నిర్ణయం తీసుకున్నామని, సహకరించాలని చంద్రబాబు ప్రజలకు లేఖ రాశారు. తర్వాత రెండు హామీలను.. సబ్సిడీ బియ్యం, మద్య నిషేధం తొలగించారు. కానీ పెంచిన పన్నులు తగ్గించలేదు. 1999 ఎన్నికల్లో ఇచ్చిన.. 35 లక్షల ఇళ్ల నిర్మాణం, కోటి మందికి ఉద్యోగాలు, 25 లక్షల ఎకరాలకు సాగునీరు తదితర హామీలను తుంగలో తొక్కారు. 25 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని.. 5 లక్షల ఎకరాలకూ ఇవ్వలేకపోయారు. కోటి ఉద్యోగాలిస్తామని.. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారు. ఇళ్ల నిర్మాణం నామమాత్రమే. ఇప్పుడు కూడా గతంలో మాదిరే చేస్తున్నారు. గత ప్రభుత్వాల మీద నెపం నెట్టడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రుణ మాఫీ కంటే రీషెడ్యూలే మేలంటూ టీడీపీ అధికార గజిట్ ‘ఈనాడు’ పత్రికలో కథనాలు వండివారిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. గతంలో మాదిరే మాట తప్పుతారని, చంద్రబాబు మళ్లీ ప్రజలకు లేఖ రాస్తారేమోనని రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగ యువత భయాందోళనల్లో ఉన్నారు. అందుకే అసెంబ్లీలో గట్టిగా అడుగుతున్నాం. రుణ మాఫీ, నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం ఏం చెప్తుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. శాసనసభ సాగుతున్న తీరును గమనిస్తున్నారు.
 
Share this article :

0 comments: