పార్టీ అండగా ఉంటుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ అండగా ఉంటుంది

పార్టీ అండగా ఉంటుంది

Written By news on Tuesday, August 12, 2014 | 8/12/2014

మనోధైర్యం కోల్పోవద్దు : వైఎస్ జగన్
  •    పార్టీ అండగా ఉంటుంది
  •   వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అధినేత వైఎస్ జగన్ భరోసా
  •   బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి
  •   మొండితోక జగన్మోహనరావుకు సూచన
నందిగామ : కష్టకాలంలో కార్యకర్తలకు అండగా ఉండాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించినట్లు ఆ పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తనకు ఫోన్‌చేసి గొట్టుముక్కల గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకుడు కృష్ణారావు హత్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు.

టీడీపీ నాయకులు పథకం ప్రకారం కృష్ణారావును తుదముట్టించారని చెప్పినట్లు ఆయన వివరించారు. రెండు నెలలుగా గ్రామంలో టీడీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతుంటే పోలీసులు పట్టించుకోలేదని, వారి వైఫల్యంవల్లే ఈ ఘాతుకం జరిగిందని వివరించినట్లు ఆయన తెలిపారు. నిందితులను అరెస్టుచేసే వరకు ఉద్యమించాలని వైఎస్ జగన్ సూచించారని చెప్పారు.

వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ దాడులను ఉద్యమాల ద్వారా ప్రతిఘటించాలని కోరారని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టంచేశారని చెప్పారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని సూచించారని తెలిపారు. కృష్ణారావు కుటుం బానికి అండగా నిలిచి న్యాయం జరిగేలా చూ డాలని జగన్ చెప్పారని ఆయన పేర్కొన్నారు.
Share this article :

0 comments: