
నెల్లూరు: నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్‌తోపాటు 12 మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అబ్దుల్ అజీజ్ పై చర్య తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్‌కు వైస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం సమర్పించారు.
ఎన్నికల నియమావళి, నిబంధనలకు వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన అజీజ్ కు మేయర్ గా కొనసాగే హక్కులేదని కోటంరెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి నెల్లూరు మేయర్ గా ఎంపికైన అబ్దుల్ అజీజ్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment