
* పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన 68వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రతి అవ్వా, తాతలకు, ప్రతి సోదరి, సోదరులకు ఈ స్వాతంత్య్ర దినోత్సవం సుఖ సంతోషాలనివ్వాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజలతో గంటకుపైగా గడిపి వారందరితో ముచ్చటించారు.
షారిఖ్‌కు అభినందన..
అమెరికాలోని కనెక్టికట్ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రంలో పీహెచ్‌డీ సీటు సాధించిన కర్నూలుకు చెందిన షారిఖ్ అహ్మద్‌ను జగన్ ఈ సందర్భంగా అభినందించారు. దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
0 comments:
Post a Comment