వైఎస్‌ఆర్ వర్ధంతికి ఘనంగా ఏర్పాట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్‌ఆర్ వర్ధంతికి ఘనంగా ఏర్పాట్లు

వైఎస్‌ఆర్ వర్ధంతికి ఘనంగా ఏర్పాట్లు

Written By news on Tuesday, August 26, 2014 | 8/26/2014

వైఎస్‌ఆర్ వర్ధంతికి ఘనంగా ఏర్పాట్లు
  • - భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి : దివంగత సీఎం డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని సెప్టెంబర్ 2న ఘనంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు.   కోటకొమ్మలవీధిలోని పార్టీ కార్యాలయంలో వర్ధంతి ఏర్పాట్లపై చర్చించేందుకు సోమవారం పాలగిరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్‌ఆర్‌సీపీ తిరుపతి నగర శాఖ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 2న వైఎస్‌ఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలను కోరారు. వైఎస్.రాజశేఖరరెడ్డికి తిరుపతితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.

వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ రాష్ట్రవ్యాప్తంగా దమనకాండ సాగిస్తోందని అయితే అలాంటి వాటికి భయపడకుండా ధైర్యంగా కార్యకర్తలు వైఎస్‌ఆర్  ఆశయాల సాధన ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. వైఎస్‌ఆర్ వర్ధంతి రోజున 2 వేల మందికి తగ్గకుండా పేదలకు అన్నదానం చేయాలని, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

సమావేశంలో దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎంవీఎస్.మణి, షపీఅహమ్మద్ ఖాద్రి, పుల్లయ్య, ఆదికేశవులురెడ్డి, మాజీ ఎంపీపీ తిరుమలయ్య, మాజీ ఎంపీటీసీ మదన్‌మోహన్‌రెడ్డి, టీ.రాజేంద్ర, కొమ్ము చెంచయ్యయాదవ్, హర్ష, గోపీయాదవ్, మౌలా, మునిరామిరెడ్డి, నాగిరెడ్డి, బొమ్మగుంట రవి, కే.అమరనాథరెడ్డి, తాళ్లూరు ప్రసాద్, జీవకోన మహబూబ్‌బాషా, బచ్చుమునికృష్ణ, పెరుమాళ్, చెలికం కుసుమ, పునీత, లక్ష్మి, లతారెడ్డి, శాంతారెడ్డి, గౌరి, పుష్పలత, లక్ష్మీకాంతమ్మ, ఎంకే. నాగరాజు, చానూ పాల్గొన్నారు.
Share this article :

0 comments: