బిజీబిజీగా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బిజీబిజీగా..

బిజీబిజీగా..

Written By news on Friday, August 15, 2014 | 8/15/2014

బిజీబిజీగా..
- బంధువులు,స్నేహితులతో కలివిడిగా జగన్
- కుటుంబ సభ్యులతో కలిసి పలు వివాహాలకు హాజరు
- వేంపల్లెలో మూడు కుటుంబాలకు పరామర్శ
 సాక్షి కడప/కార్పొరేషన్/వేంపల్లె/ముద్దనూరు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపారు. ఒకపక్క వివాహ కార్యక్రమాలకు హాజరవుతూనే.. మరోపక్క తనను కలవడానికి వస్తున్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7గంటలవరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలు, రైతులతో గడిపారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.  
 
వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
ఒకరోజు జిల్లా పర్యటనకు హైదరాబాదునుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం ముద్దనూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,ప్రతిపక్షనాయకుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ,సతీమణి భారతీరెడ్డితో కలసి రైలు దిగిన జగన్మోహన్‌రెడ్డికి ఎంపీ వైయస్ అవినాష్‌నెడ్డి, మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు భూపేష్‌రెడ్డి,సంబటూరు ప్రసాద్‌రెడ్డి,రాయచోటి మదన్‌మోహన్‌రెడ్డి,వ్యక్తిగత కార్యదర్శి రవి ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరి వెళ్ళారు.

పులివెందులలోని వీజే కళ్యాణ మండపంలో జరిగిన  వైఎస్ జోసఫ్‌రెడ్డి కుమార్తె వీణా, పవన్‌కుమార్‌రెడ్డి వివాహానికి గురువారం ఉదయాన్నే  వైఎస్ జగన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. సాయంత్రం పాల్‌రెడ్డి ఫంక్షన్ హాలులో పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డి మనుమడు, తొండూరు మండల ఇన్‌ఛార్జి వైఎస్ మధురెడ్డి కుమారుడు వైఎస్ అభినవ్‌రెడ్డి, కృష్ణచైతన్యల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తదితరులతో కలిసి వివాహ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం అంబకపల్లె లక్ష్మినారాయణరెడ్డి కుమారుడు శ్రీనాథరెడ్డి, సుమతి వేముల జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి సోదరుడు చంద్రమోహన్‌రెడ్డి, కవితల వివాహానికి కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత కడపకు వెళ్లి సోమశేఖరరెడ్డి కుమార్తె శివతేజ, మనో వికాస్‌లను ఆశీర్వదించారు. శిల్పారామంలో ఇందుకూరు రమణారెడ్డి కుమార్తె ప్రశాంతి, సునీల్ రిసెప్షన్ వేడుకకు హాజరై వారిని ఆశీర్వదించారు.
 
మూడు కుటుంబాలకు పరామర్శ :
మండల కేంద్రమైన వేంపల్లెకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్త బొమ్మిరెడ్డి రామిరెడ్డి 10రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం వైఎస్ జగన్ వేంపల్లెకు వెళ్లి రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన కొరివి నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వేంపల్లెకు చెందిన కొండయ్య ఈ మధ్యనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ కొండయ్య భార్య ఈశ్వరమ్మను పరామర్శించారు. ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్ వల్లీ ఆయన వెంట ఉన్నారు. అంతకు ముందు వేంపల్లెకు చేరుకున్న వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది.

వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు :
పులివెందుల పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌ను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌వివేకానందరెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, మేయర్ సురేష్‌బాబు తదితరులు కలిసి అనేక అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.
రాజన్న పాలన కోసం ఎదురు  చూస్తున్నాం

రాజన్న పాలన కోసం తాము ఎదురు చూస్తున్నామని కడపలోని రవీంద్రనగర్ మహిళలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో అన్నారు. గురువారం ఆయన కొమ్మా సోమశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్తుండగా కొందరు మహిళలు ఆయన కాన్వాయ్‌కి అడ్డుపడి దిగాలని పట్టుబట్టారు. ఎన్నికల్లో మీ ప్రభుత్వమే వస్తుందని ఆశపడ్డామని   పరిస్థితి తారుమారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ వారిని ఆప్యాయంగా పలకరించి, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: