కదిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు టీడీపీ బెదిరింపులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కదిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు టీడీపీ బెదిరింపులు

కదిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు టీడీపీ బెదిరింపులు

Written By news on Tuesday, August 19, 2014 | 8/19/2014

కదిరి : అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా కదిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేకు బెదిరింపులు వస్తున్నాయి. నెల రోజుల్లోగా పార్టీకి రాజీనామా చేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పుకోవాలని, లేకపోతే చంపేస్తామని ఎమ్మెల్యే చాంద్ బాషాకు ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో ఎమ్మెల్యే చాంద్ బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని తలపుల మండలం ఇందుకూరుపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త సూర్యగా గుర్తించారు. నిందితునిపై ఐపీసీ 341, 506, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, గుట్టుచప్పుడు కాకుండా రిమాండ్‌కు తరలించారు.
దీనిపై ఎమ్మెల్యే చాంద్ బాషా ఇలా చెప్పారు.. ''నేను తలపుల మండలం వెళ్తుంటే .. ఈనెల 11వ తేదీన మిస్డ్ కాల్ వచ్చింది. మూడు నిమిషాల తర్వాత మరో కాల్ వచ్చింది. రాజీనామా చేయాలని అన్నారు. ఎవరు నువ్వు అని అడిగాను. నేనెవరో అనవసరం, రాజీనామా చేస్తావా చెయ్యవా అని అడిగారు. నేనెవరో తెలుస్తుంది.. నెల రోజుల్లోగా రాజీనామా చేయకపోతే నీ కథ చూస్తాం అన్నారు. దీనిపై నేను విచారణ చేసిన తర్వాత తలపుల మండలానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి అని తెలిసింది. అతడు ఇంతకుముందు శివారెడ్డి అనే వ్యక్తి మీద జరిగిన హత్య కేసులో కూడా నిందితుడని తెలిసింది. పోలీసులు తర్వాత అతడిని పట్టుకున్నారు.''
Share this article :

0 comments: